తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live December 6, 2024: Warangal Murder Case: ట్రాప్ చేసే హతమార్చారా..? ఇంకా వీడని రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మర్డర్ మిస్టరీ
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 06 Dec 202404:40 PM IST
తెలంగాణ News Live: Warangal Murder Case: ట్రాప్ చేసే హతమార్చారా..? ఇంకా వీడని రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మర్డర్ మిస్టరీ
- రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మర్డర్ మిస్టరీ కేసు ఇంకా వీడలేదు. అన్ని కోణాల్లో వరంగల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే రాజామోహన్ హత్యపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రాప్ చేసే హతమార్చారా..? అనే విషయం కొత్తగా తెరపైకి వచ్చింది.
Fri, 06 Dec 202402:33 PM IST
తెలంగాణ News Live: TG Police Home Guards : హోంగార్డులకు తీపి కబురు - జీతాల పెంపుపై ప్రకటన, జనవరి నుంచే అమలు!
- హోంగార్డులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించారు.దినసరి వేతాన్ని రూ.921 నుంచి రూ.1000కి, వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను నెలకు రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాలు జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి.
Fri, 06 Dec 202401:42 PM IST
తెలంగాణ News Live: Warangal Bank Robbery : మారుమూల బ్యాంకులే టార్గెట్ - SBI బ్యాంక్ చోరీ ముఠా అరెస్ట్, వెలుగులోకి కీలక విషయాలు
- Warangal Bank Robbery Case : రాయపర్తి ఎస్‌బీఐ బ్యాంకులో బంగారం చోరీ కేసును వరంగల్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ దోపిడికి పాల్పడిన ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడితో సహా మరో నలుగురు పరారీలో ఉన్నారని సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు.
Fri, 06 Dec 202412:28 PM IST
తెలంగాణ News Live: TGPSC Group 1 : గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ - పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
- TGPSC Group 1 Exams : తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్ అయిపోయింది. నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా వేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. సుప్రీం తీర్పుతో పరీక్ష రాసిన అభ్యర్థులకు ఊరట లభించినట్లు అయింది.
Fri, 06 Dec 202411:41 AM IST
తెలంగాణ News Live: Telangana Congress Govt : కాంగ్రెస్ ఏడాది పాలన - ఉద్యోగాల భర్తీ ఎక్కడి వరకు వచ్చింది..?
- తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పూర్తి కావొచ్చింది. అయితే ఈ సంవత్సర కాలంలో ఉద్యోగాల భర్తీకి పలు చర్యలు తీసుకుంది. టీజీపీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసింది. కొత్తగా టీచర్లను రిక్రూట్ చేయగా.. మరోవైపు గ్రూప్ 1, 3 పరీక్షలను కూడా నిర్వహించింది.
Fri, 06 Dec 202411:41 AM IST
తెలంగాణ News Live: Hyderabad Metro : మలక్‌పేట్ మెట్రోస్టేషన్ కింది అగ్నిప్రమాదం.. రాకపోకలకు అంతరాయం
- Hyderabad Metro : హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం జరిగింది. ఈసారి మెట్రో స్టేషన్ కింద ప్రమాదం జరగడంతో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన బైక్‌లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న వాహనాలకు మంటలు అంటుకొని ప్రమాదం జరిగింది.
Fri, 06 Dec 202409:42 AM IST
తెలంగాణ News Live: Jagtial Donga Mallanna Temple : దొంగ మల్లన్న జాతరకు వేళాయె..! ఈనెల 30 వరకు ఉత్సవాలు
- Donga Mallanna Jatara : దేవుడిని భక్తితో కొలుస్తాం... కోరిన కోరికలు తీర్చాలని ఆరాధిస్తాం. కానీ జగిత్యాల జిల్లాలో దేవున్ని దొంగ మల్లన్నగా భావిస్తూ పూజిస్తారు. షష్టి మల్లన్నగా కొలుస్తారు. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల పాలిట కొంగుబంగారంగా ఇలవేల్పుగా విరజిల్లుతున్న దొంగమల్లన్న జాతర ప్రారంభమైంది.
Fri, 06 Dec 202408:32 AM IST
తెలంగాణ News Live: SCR Sabarimala Special Trains : ఏపీ, తెలంగాణ నుంచి శబరిమలకు 28 ప్రత్యేక రైళ్లు - ఇవాళ్టి నుంచే రాకపోకలు!
- South Central Railway Sabarimala Trains : శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ లోని మౌలాలి, కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వేర్వేరు స్టేషన్ల నుంచి 28 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది.
Fri, 06 Dec 202407:47 AM IST
తెలంగాణ News Live: Adilabad : రోడ్డుపై పులి గాండ్రింపు.. బెదిరిపోయిన వాహనదారులు.. ఆందోళనలో ప్రజలు
- Adilabad : పులులు ఆదిలాబాద్ జిల్లా ప్రజలను భయపెడుతున్నాయి. ఇన్నాళ్లు అడవుల్లో తిరిగిన పులులు.. ఇప్పుడు నడిరోడ్డుపై గాండ్రిస్తున్నాయి. తాజాగా ఓ చిరుత రోడ్డుపై కూర్చొని వాహనదారులను భయపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే పులి దాడిలో ఓ మహిళ మృతిచెందింది.
Fri, 06 Dec 202407:37 AM IST
తెలంగాణ News Live: TGPSC Merit Order: మెరిట్ అభ్యర్థులకు మేలు చేసేలా టీజీపీఎస్సీ రిక్రూట్‌మెంట్, ఏప్రిల్ కల్లా గ్రూప్ 1, 2, 3 నియామకాలు
- TGPSC Merit Order: తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మెరిట్ అభ్యర్థులకు నష్టపోకుండా, కింద స్థాయి పోస్టుల్లో చేరిన వారు ఎంపికైన తర్వాత పోస్టుల్ని వదులుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ప్రాధాన్యత క్రమంలో పోస్టుల్ని భర్తీ చేయనుంది.
Fri, 06 Dec 202405:19 AM IST
తెలంగాణ News Live: Warangal : వరుస హత్యలు.. దోపిడీలు, దొంగతనాలు.. వణికిపోతున్న ఓరుగల్లు!
- Warangal : వరంగల్.. ప్రశాంతతకు మారుపేరు. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు సీన్ మారింది. కారణాలు ఏమైనా క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలతో ఓరుగల్లు ప్రజలు వణికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఘటనలు జరగడంతో భయాందోళనకు గురవుతున్నారు.
Fri, 06 Dec 202404:18 AM IST
తెలంగాణ News Live: Telangana Bandh : ఈనెల 9న తెలంగాణ బంద్.. పిలుపునిచ్చిన జగన్.. కారణం ఇదే
- Telangana Bandh : ఈనెల 9న తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ములుగు జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చినట్టు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేశారు. అలాగే చెల్పాక ఎన్‌కౌంటర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.