Telangana News Live December 31, 2024: TGSRTC Special Buses : ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, సంక్రాంతికి 6432 ప్రత్యేక బస్సులు-today telangana news latest updates december 31 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live December 31, 2024: Tgsrtc Special Buses : ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, సంక్రాంతికి 6432 ప్రత్యేక బస్సులు

TGSRTC Special Buses : ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, సంక్రాంతికి 6432 ప్రత్యేక బస్సులు

Telangana News Live December 31, 2024: TGSRTC Special Buses : ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, సంక్రాంతికి 6432 ప్రత్యేక బస్సులు

04:00 PM ISTDec 31, 2024 09:30 PM HT Telugu Desk
  • Share on Facebook
04:00 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 31 Dec 202404:00 PM IST

తెలంగాణ News Live: TGSRTC Special Buses : ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, సంక్రాంతికి 6432 ప్రత్యేక బస్సులు

  • TGSRTC Special Buses : సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీజీఎస్ఆర్టీసీ 6432 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. వీటిలో 557 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొంది. జనవరి 9 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202401:02 PM IST

తెలంగాణ News Live: Dil Raju On KTR : రాజకీయ ప్రతిదాడులకు చిత్ర పరిశ్రమను వాడుకోవద్దు- కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన దిల్ రాజు

  • Dil Raju On KTR : రాజకీయ దాడి, ప్రతిదాడులకు చిత్ర పరిశ్రమను వాడుకోవద్దని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు కోరారు. సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగొద్దని విజ్ఞప్తి చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202411:05 AM IST

తెలంగాణ News Live: Kumbh Mela Trains : కుంభ మేళాకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, మరో ఎనిమిది ప్రత్యేక రైళ్లు ప్రకటన

  • Kumbh Mela Special Trains : ఉత్తర్ ప్రదేశ్ లో జరిగే కుంభ మేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కుంభ మేళాకు మరో ఎనిమిది ప్రత్యేక రైళ్ల సేవలు ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే. మరో నాలుగు రైళ్ల సేవలు పొడిగించింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202411:04 AM IST

తెలంగాణ News Live: TG Govt Employees : ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. జనవరి 1 నుంచి ఈ కొత్త రూల్ పాటించాల్సిందే!

  • TG Govt Employees : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 1 నుంచి కొత్త రూల్ పాటించాల్సిందే. అవును.. సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల అటెండెన్స్ విధానాన్ని మార్చారు. ఇకనుంచి ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202408:20 AM IST

తెలంగాణ News Live: KTR Case : ఫార్ములా ఈ-కార్‌ రేస్ కేసుపై హైకోర్టులో విచారణ.. కేటీఆర్ తరపు లాయర్ లాజిక్ ఇదే!

  • KTR Case : ఫార్ములా ఈ-కార్‌ రేస్ కేసుపై హైకోర్టులో విచారణ ప్రారంభం అయ్యింది. అటు ఏసీబీ, ఇటు కేటీఆర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. కేటీఆర్ తరఫున సిద్దార్థ్ దావే వాదనలు వినిపిస్తూ.. కీలక అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసిన సెక్షన్ అసలు కేటీఆర్‌కు వర్తించదని స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202407:50 AM IST

తెలంగాణ News Live: Khammam Tragedy : ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం.. ఉరేసుకొని ఇద్దరు ఆత్మహత్య

  • Khammam Tragedy : కొత్త సంవత్సరం వేళ ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటనలు జరిగాయి. ఉరేసుకొని ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. మధిర మండలంలో ఓ విద్యార్థి, వెంగన్నపాలెంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202407:04 AM IST

తెలంగాణ News Live: TG Ration cards: తెలంగాణలో సంక్రాంతికైనా రేషన్ కార్డులు వచ్చేనా? ఆశావాహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ..

  • TG Ration cards: ప్రభుత్వం అందించే ఏ పథకానికైనా రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో రేషన్ కార్డు కోసం వేచి చూస్తున్న ప్రజలకు ప్రభుత్వం  రేపు మాపు అంటూ  ప్రకటనలు జారీ చేసింది.ఇటీవల క్యాబినెట్‌లో సంక్రాంతి పండుగకు రేషన్ కార్డులిస్తామనూ  ప్రకటనపై ప్రజల్లో సందేహాలు కొనసాగుతున్నాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202405:34 AM IST

తెలంగాణ News Live: TG Agriculture : డ్రోన్‌తో వరి నాట్లు.. ఖర్చు తక్కువ.. అన్నదాతలకు ఎన్నో లాభాలు!

  • TG Agriculture : ప్రస్తుతం వ్యవసాయం భారంగా మారింది. పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగాయి. చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సాగు ఖర్చులను తగ్గించే పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా.. డ్రోన్లతో వరి విత్తే ప్రయోగం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202404:29 AM IST

తెలంగాణ News Live: TG Rythu Bharosa : జనవరి 3న క్యాబినెట్‌ భేటీ.. రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం!

  • TG Rythu Bharosa : రైతు భరోసా కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక అప్‌డేట్ వచ్చింది. జనవరి 3న రైతు భరోసా అమలుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇంకా వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయంపై కూడా క్యాబినెట్‌లో చర్చించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202403:57 AM IST

తెలంగాణ News Live: Bandi Sanjay: కాంగ్రెస్ కేరాఫ్ కమీషన్ల సర్కార్...14 శాతం కమీషన్ ఇస్తేనే పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తారన్న బండి సంజయ్

  • Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుండి 14 శాతం కమీషన్లు దండుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ కేబినెట్ లో కొందరు నిజాయితీ మంత్రులున్నారని, వారికి ఈ విషయం ఏ మాత్రం నచ్చడం లేదన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202401:16 AM IST

తెలంగాణ News Live: Karimnagar Police: తాగి రోడ్డెక్కితే అంతే సంగతులు...31 రాత్రిపై పోలీసుల స్పెషల్ ఫోకస్..

  • Karimnagar Police: కరీంనగర్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు శృతి మించకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. నిషేధాజ్ఞలు విధించడంతోపాటు మద్యం సేవించి రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202412:46 AM IST

తెలంగాణ News Live: Land Recovery: భూ ఆక్రమణలపై ప్రభుత్వ కొరడా, కలెక్టర్‌కు భూమి అప్పగించిన లక్ష‌్మీపురం మాజీ సర్పంచ్

  • Land Recovery: భూ అక్రమణలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీసులు కొరడా ఝుళిపించారు. పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసి ప్రజాప్రతినిధులను రాజకీయ నాయకుల అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం నుంచి పొందిన భూమిని మాజీ సర్పంచ్ తిరిగి అప్పగించడం సంచలనంగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి