Telangana News Live December 28, 2024: Hyderabad RRR Tenders : హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి బిగ్ బూస్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 28 Dec 202404:53 PM IST
Hyderabad RRR Tenders : హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగంలో నాలుగు లేన్ల ఎక్స్ ప్రెస్ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. రెండేళ్లలో సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మించాలి. రూ.5,555 కోట్లతో రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచారు.
Sat, 28 Dec 202401:34 PM IST
ACB Raids : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ అధికారుల అవినీతి ఆగడంలేదు. గత నెలలో అంతర్గాం తహసీల్దార్ ఏసీబీకి చిక్కితే తాజాగా శంకరపట్నం డిప్యూటీ తహసీల్దార్ మల్లేశం పట్టుబడ్డారు. రూ.6000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ చిక్కి అరెస్టు అయ్యారు.
Sat, 28 Dec 202412:14 PM IST
- Hydra : హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటింది. ఈ సందర్బంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. కీలక విషయాలు వెల్లడించారు. కూల్చివేతలపై క్లారిటీ ఇచ్చారు. ఓఆర్ఆర్ వరకు హైడ్రా పరిధి ఉందని స్పష్టం చేశారు. హైడ్రా వల్ల ప్రజలకు అవగాహన కలిగిందని వ్యాఖ్యానించారు.
Sat, 28 Dec 202411:43 AM IST
- Jagtial : జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఇటీవల సరెండర్ చేసినా సిబ్బంది నిర్లక్ష్యం వీడడంలేదు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే వారిపట్ల కఠినంగా ప్రవర్తించి పరువు తీస్తున్నారు. పేషెంట్లకు సక్రమంగా వైద్యం అందాలంటే.. వైద్య సిబ్బందికి చికిత్స చేయాల్సిన అవసరం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Sat, 28 Dec 202409:27 AM IST
- Formula E Car Race Case : ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మాజీమంత్రి కేటీఆర్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. డబ్బుల చెల్లింపుతో తనకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sat, 28 Dec 202408:22 AM IST
TG Police : తెలంగాణ పోలీస్ శాఖలో సిబ్బంది వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కానిస్టేబుల్, ఎస్సై స్థాయి అధికారులు పలు కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయి. పని ఒత్తిడి, వేధింపులు, వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత వృత్తిపర సమస్యలు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Sat, 28 Dec 202408:01 AM IST
- TG MLC Election : బీఆర్ఎస్.. ఒకప్పుుడు ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్న పార్టీ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కనీసం ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఘార పరాభవం తర్వాత.. బీఆర్ఎస్ వీక్ అయ్యిందనే చర్చ జరుగుతోంది.
Sat, 28 Dec 202407:44 AM IST
- Telangana Tourism Srisailam Package : ఈ ఇయర్ ఎండ్ వేళ శ్రీశైలం చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. రెండు రోజులపాటు ట్రిప్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. టూర్ షెడ్యూల్, ధరల వివరాలను ఇక్కడ చూడండి….
Sat, 28 Dec 202406:45 AM IST
- Warangal Tiger : ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులుల సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా రైతులు పొలాల వద్దకు వెళ్లడానికి భయపడుతున్నారు. పులుల సంచారంతో ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని, అడవుల్లోకి వెళ్లవద్దని సూచించారు.
Sat, 28 Dec 202404:47 AM IST
- Kamareddy Police : కామారెడ్డి జిల్లాలో మిస్టరీగా మారిన ముగ్గురి మృతుల కేసు విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తొలుత శృతి సూసైడ్ చేసుకునేందుకు దూకగా.. ఆమెను కాపాడేందుకు సాయి, నిఖిల్ నిటిలోకి దూకినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముగ్గురు చనిపోయారు.
Sat, 28 Dec 202403:22 AM IST
- ఫార్ములా- ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని జనవరి 2,3 తేదీల్లో విచారించనుంది.
Sat, 28 Dec 202401:52 AM IST
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చిన్నారుల్లో పోషకాహార లోపం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు… ఆరేళ్లలోపు పిల్లలను రక్తహీనత వేధిస్తోంది. అవగాహన లోపంతో గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం లేకపోవటంతో పాటు బాల్య వివాహాలతో చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం వంటివి ఇందుకు కారణమవుతున్నాయి.