తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live December 27, 2024: TG Bhu Bharathi Act 2024 : భూ భారతి చట్టంలో ఏముంది..? అమల్లోకి వస్తే జరిగే మార్పులేంటి..?
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 27 Dec 202404:34 PM IST
తెలంగాణ News Live: TG Bhu Bharathi Act 2024 : భూ భారతి చట్టంలో ఏముంది..? అమల్లోకి వస్తే జరిగే మార్పులేంటి..?
- Telangana Bhu Bharathi Act 2024 : భూ భారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చట్టం అమల్లోకి రాబోతుంది. అర్వోఆర్-2020ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తూ… ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి చట్టం అమల్లోకి రానుంది.
Fri, 27 Dec 202403:48 PM IST
తెలంగాణ News Live: Charlapalli Railway Station : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం వాయిదా..! దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
- అధునాతన హంగులతో సిద్దమైన చర్లపల్లి రైల్ టెర్మినల్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. తదుపరి ప్రారంభోత్సవ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు 430 కోట్ల రూపాయలతో ఈ టెర్నినల్ నిర్మాణం చేశారు.
Fri, 27 Dec 202403:08 PM IST
తెలంగాణ News Live: Vemulawada Temple : వేములవాడలో నిఘా వైఫల్యం..! భక్తులను ఆందోళనకు గురి చేస్తున్న వరుస ఘటనలు
- వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మొన్న రాజన్న కోడలు అక్రమంగా విక్రయానికి గురైన ఘటన మరిచిపోక ముందే ఆలయంలోని హుండీలో నగదు మాయం కలకలం సృష్టిస్తుంది. మరోవైపు మాంసాహారం ఆలయ ఆవరణలో పంపిణీ విమర్శలకు తావిస్తుంది.
Fri, 27 Dec 202412:57 PM IST
తెలంగాణ News Live: TG Govt Public Holidays : 2025 సెలవుల జాబితా విడుదల చేసిన తెలంగాణ సర్కార్ - మొత్తం ఎన్నంటే..?
- TG Govt Public Holidays List: వచ్చే ఏడాది 2025కి సంబంధించి సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 27 సాధారణ సెలవులను ప్రకటించగా.. 23 ఆప్షనల్ హాలిడేస్ ను ప్రకటించింది.
Fri, 27 Dec 202410:50 AM IST
తెలంగాణ News Live: Warangal Bhadrakali Lake : భద్రకాళి చెరువులో 'ఐలాండ్' ప్రతిపాదన..! సర్కార్ ప్లాన్ ఇదేనా..?
- ఓరుగల్లు భద్రకాళి చెరువును సుందరీకరణ చేయాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా ఇప్పటికే కార్యాచరణను కూడా సిద్ధం చేసింది. ఇందులో భాగంగా చెరువులోని నీటిని ఖాళీ చేయగా.. ద్వీప స్వరూపం బయటకు వచ్చింది. . దీంతో మరోసారి ఐలాండ్ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది.
Fri, 27 Dec 202410:35 AM IST
తెలంగాణ News Live: SCR Special Trains : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు
- South Central Railway Special Trains : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. రద్దీని తగ్గించేందుకు 20 ప్రత్యేక రైళ్లను పొడిగించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. ఇందులో చాలా రైళ్లు, ఏపీ, తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించేవి ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ ట్రైన్స్ నడవనున్నాయి.
Fri, 27 Dec 202410:05 AM IST
తెలంగాణ News Live: KTR Case : కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు
- KTR Case : తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్‌ను ఈనెల 31 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ సందర్భంగా ఏం జరగబోతోందనే చర్చ జరుగుతోంది.
Fri, 27 Dec 202408:46 AM IST
తెలంగాణ News Live: Sabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమలకు వెళ్లే 14 ప్రత్యేక రైళ్లు రద్దు.. వీరిపై ఎఫెక్ట్!
- Sabarimala Special Trains : సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలకు వెళ్లే 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. ఈ ప్రభావం జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 మధ్య శబరిమల వెళ్లేవారిపై పడనుంది. రైళ్లను రద్దు చేయడానికి అధికారులు వివిధ కారణాలు చెబుతున్నారు.
Fri, 27 Dec 202407:24 AM IST
తెలంగాణ News Live: South Central Railway : తెలంగాణ, ఏపీ మధ్య మరో కొత్త రైల్వే లైన్.. హైదరాబాద్- విశాఖ మధ్య 150 కి.మీ తగ్గనున్న దూరం
- South Central Railway : కొత్తగూడెం- కొవ్వూరు రైల్వేలైన్ నిర్మాణం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నిర్మాణానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈ లైన్ నిర్మాణం పూర్తయితే.. హైదరాబాద్- విశాఖ మధ్య 150 కి.మీ దూరం తగ్గనుంది. దీనికి సంబంధించిన కీలక విషయాలు ఇలా ఉన్నాయి.
Fri, 27 Dec 202405:35 AM IST
తెలంగాణ News Live: New Year Cyber Crime : సైబర్ సైరన్.. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే.. ఉన్నదంతా ఊడ్చేస్తారు జాగ్రత్త!
- New Year Cyber Crime : అమాయకులను దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. తాజాగా.. కొత్త సంవత్సరం పేరుతో దోచుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అలర్ట్‌గా పోలీసులు సూచించారు. ఒక్క క్లిక్‌తో ఉన్నదంతా ఊడ్చేస్తారని హెచ్చరించారు.
Fri, 27 Dec 202404:21 AM IST
తెలంగాణ News Live: TG New Ration Cards : పథకాలకు దూరం.. ఇంకా ఎంత కాలం? రేషన్ కార్డుల కోసం పేదల ఎదురుచూపులు
- TG New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ కాక చాలా కాలం అయ్యింది. దీంతో చాలామంది పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదు. ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. కానీ కార్డులు జారీ కాలేదు. ఈసారి అయినా జారీ చేస్తారా అని పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Fri, 27 Dec 202403:26 AM IST
తెలంగాణ News Live: Hyderabad tragedy: తండ్రి చేసిన అప్పులు తీర్చాలని కుమార్తెకు కానిస్టేబుల్ టార్చర్, భరించలేక యువతి ఆత్మహత్య
- Hyderabad tragedy: ఓ తండ్రి చేసిన అప్పుల్ని తీర్చాలంటూ అతని కుమార్తెను పోలీస్ కానిస్టేబుల్ అతని భార్య తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. పోలీస్ కేసులో ఇరికించడంతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Fri, 27 Dec 202402:38 AM IST
తెలంగాణ News Live: Revanth And CBN: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు చంద్రబాబు, రేవంత్ రెడ్డి నివాళులు
- Revanth And CBN: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మన్మోహన్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. దేశం గొప్ప రాజకీయ నాయకుడిని కోల్పోయిందని రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
Fri, 27 Dec 202401:40 AM IST
తెలంగాణ News Live: TG Govt Holiday: నేడు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- TG Govt Holiday: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి నివాళిగా తెలంగాణలో నేడు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు.