Telangana News Live August 29, 2024: Union Minister Bandi Sanjay : అమెరికాలోనే అప్పగింతలు...! కేటీఆర్ టూర్ పై బండి సంజయ్ సీరియస్ కామెంట్స్-today telangana news latest updates august 29 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live August 29, 2024: Union Minister Bandi Sanjay : అమెరికాలోనే అప్పగింతలు...! కేటీఆర్ టూర్ పై బండి సంజయ్ సీరియస్ కామెంట్స్

Union Minister Bandi Sanjay : అమెరికాలోనే అప్పగింతలు...! కేటీఆర్ టూర్ పై బండి సంజయ్ సీరియస్ కామెంట్స్

Telangana News Live August 29, 2024: Union Minister Bandi Sanjay : అమెరికాలోనే అప్పగింతలు...! కేటీఆర్ టూర్ పై బండి సంజయ్ సీరియస్ కామెంట్స్

04:55 PM ISTAug 29, 2024 10:25 PM HT Telugu Desk
  • Share on Facebook
04:55 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 29 Aug 202404:55 PM IST

Telangana News Live: Union Minister Bandi Sanjay : అమెరికాలోనే అప్పగింతలు...! కేటీఆర్ టూర్ పై బండి సంజయ్ సీరియస్ కామెంట్స్

  • బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు. ఇండియాలో మాట ముచ్చటైందని... అమెరికాలో అప్పగింతలు కాబోతున్నాయని అన్నారు. కేటీఆర్ అందుకోసమే అమెరికా వెళ్లారని.. ఈ రెండు పార్టీలో ఒక్కటేనని విమర్శించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని ఫైర్ అయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202402:44 PM IST

Telangana News Live: HYDRA : హైడ్రా మరో సంచలన నిర్ణయం..! అనుమతులిచ్చిన అధికారులపై కేసులు..?

  • హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలువురు అధికారులపై కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202412:32 PM IST

Telangana News Live: Medak Tragedy: ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతు.. షాక్‌లో వారి స్నేహితుడు

  • Medak Tragedy: మెదక్ జిల్లాలో విషాదం జరిగింది. ముగ్గురు యువకులు ఈతకు వెళ్లగా.. వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. మూడో వ్యక్తి షాక్‌లో ఉండి.. ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ఎట్టకేలకు ఆ యువకుడు నోరు విప్పడంతో.. అసలు విషయం తెలిసింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202411:11 AM IST

Telangana News Live: Ponguleti Son: పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి ఆస్తులు ఎంతో తెలుసా.. షాక్ అవుతారు..

  • Ponguleti Son: హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షారెడ్డి చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్‌లోని అత్యంత సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు. ఇటు హైదరాబాద్‌లో బిలియనీర్లు పెరిగినట్టు హురున్ ఇండియా వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202410:41 AM IST

Telangana News Live: MLC Kavitha Bail : 'రాజకీయ పార్టీలను సంప్రదించి మేము ఆదేశాలిస్తామా'..? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్

  • ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా..? అని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలి కదా..? అని సీరియస్ అయింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202410:21 AM IST

Telangana News Live: Hyderabad: బ్యాంకు అధికారి కక్కుర్తి.. సైబర్ నేరగాళ్లతో దోస్తీ.. సీన్ కట్ చేస్తే..

  • Hyderabad: రూ.175 కోట్ల భారీ మోసానికి సంబంధించి.. హైదరాబాద్‌లోని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బి) బుధవారం ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో బ్యాంకు ఉద్యోగి సైబర్ నేరగాళ్లతో చేతులు కలపడం కలకలం సృష్టిస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202409:47 AM IST

Telangana News Live: Govt Jobs 2024 : వరంగల్ 'నిట్' నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - దరఖాస్తులకు సెప్టెంబర్ 26 ఆఖ‌రు తేదీ

  • NIT Warangal Recruitment 2024 : వరంగల్ నిట్(NIT) నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు రకాల పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 26వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. https://nitw.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202408:53 AM IST

Telangana News Live: Bhupalpally District : అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు - భర్తను కట్టేసి... భార్య గొంతు కోశారు..!

  • భూపాలపల్లి జిల్లాలోని బస్వాపూర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు.. దంపతులపై దాడి చేశారు. భర్తను కట్టేసి.. భార్య గొంతును కోశారు. ఇంట్లోని నగదుతో పాటు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202408:49 AM IST

Telangana News Live: HYDRA Demolitions : 'హైడ్రా' పేరుతో బెదిరింపులు..! ఏసీబీ, విజిలెన్స్ విభాగాలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • Hydra Demolitions in Hyderabad : ‘హైడ్రా’ పేరుతో కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి అధికారులపై ఫోకస్ పెట్టాలని ఏసీబీతో పాటు విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202408:40 AM IST

Telangana News Live: MLC Kavitha: ఎర్రవల్లి నివాసానికి కవిత.. కన్న బిడ్డను చూడగానే భావోద్వేగానికి గురైన కేసీఆర్

  • MLC Kavitha: ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో భావోద్వేగ ఘటన జరిగింది. ఇటీవల జైలు నుంచి విడుదలైన కవిత.. కేసీఆర్‌ను కలవడానికి ఎర్రవల్లికి వెళ్లారు. తన బిడ్డను చూడగానే మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202408:11 AM IST

Telangana News Live: Telugu Language Day: అమ్మ భాషపై మమకారం.. 38 ఏళ్లుగా తెలుగులోనే సంతకం!

  • Telugu Language Day: అమ్మ జ‌న్మ‌నిస్తే.. మాతృ భాష తెలుగు.. జీవితాల‌కు వెలుగునిస్తోంది. అందుకే అమ్మ భాషపై చాలామంది మక్కువతో ఉంటారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మొదలు.. అనేక మంది ప్రముఖులు తెలుగు భాషపై తమకున్న మమకారాన్ని చాటుకుంటున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202407:25 AM IST

Telangana News Live: Emblem of Telangana: ఉద్యోగి కొంపముంచిన ఫ్లెక్సీ.. అందుకే జాగ్రత్తగా ఉండాలి!Untitled Story

  • Emblem of Telangana: వరంగల్ జిల్లాలో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారిపై వేటు పడింది. ఆమెదించని రాజముద్రతో ఫ్లెక్సీ వేయించిన ఆఫీసర్‌ను సస్పెండ్ చేస్తూ.. ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు వరంగల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202407:25 AM IST

Telangana News Live: Warangal: ప్రేమోన్మాది చేతిలో తల్లిదండ్రులను కోల్పోయిన దీపిక.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్

  • Warangal: వరంగల్ జిల్లాలో ఓ ప్రేమోన్మాది యువతి కుటుబంపై దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి తల్లిదండ్రులు చనిపోయారు. యువతి, ఆమె సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి అండగా ఉంటానని కేటీఆర్ మాటిచ్చారు. ఆ మాట ప్రకారం యువతికి ఆర్థిక సాయం అందించారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202407:25 AM IST

Telangana News Live: Hyderabad: దుర్గం చెరువు ఆక్రమణలు.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి కూల్చివేత నోటీసులు!

  • Hyderabad: చెరువు భూముల ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమణలకు పాల్పడ్డవారు ఎంతటి వారైనా వదలడం లేదు. తాజాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి కూడా కూల్చివేత నోటీసులు అంటించారు. ఈ ఇష్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202407:25 AM IST

Telangana News Live: Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి 48 ప్రత్యేక రైళ్లు

  • Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండగల సమయంలో ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టింది. 48 ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. వీటితో రద్దీ భారీగా తగ్గే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202407:25 AM IST

Telangana News Live: Nizamabad Marriage: పెళ్లి విందులో రగడ, పోలీస్ స్టేషన్‌కు చేరిన మటన్ పంచాయితీ, నిజామాబాద్‌లో ఘటన..

  • Nizamabad Marriage: నిజామాబాద్‌ నవీపేటలో మటన్‌ ముక్కల పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. పెళ్ళి విందులో మటన్ వడ్డించలేదంటూ మొదలైన రగడ కాస్త ఇరు వర్గాలు కొట్లాటకు దిగే వరకు వెళ్లింది. వధువరుల బంధువులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. ఈ గొడవ చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202402:21 AM IST

Telangana News Live: Sangareddy Crime: నారాయణఖేడ్‌లో దారుణం.. మద్యం మత్తులో మతిస్థిమితం లేని వృద్ధురాలి పై అత్యాచారం

  • Sangareddy Crime: కామం తో కళ్ళు మూసుకుపోయిన ఒక 35 సంవత్సరాల వ్యక్తి, మానసిక వికలాంగురాలైన, ఓ 60 సంవత్సరాల వృద్ధురాలు పై అత్యాచారానికి పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ పట్టణంలో జరిగింది. పట్టణంలోని ఒక షాప్ ముందు నిద్రిస్తున్న ఆ మహిళపై  అర్ధరాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202401:53 AM IST

Telangana News Live: Sirisilla Crime: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాటు తుపాకుల తయారీ కలకలం.. ముగ్గురు నిందితుల అరెస్ట్

  • Sirisilla Crime: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాటు తుపాకులు కలకలం రేపాయి. తుపాకులను తయారు చేసే వ్యక్తితో పాటు వాటిని ఉపయోగించే మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.  రెండు కంట్రీ మేడ్ తుపాకులతో పాటు  మూడు ఐరన్ బారెల్, 4 ట్రిగ్గర్లు ముడిసరుకులు స్వాధీనం చేసుకున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి