Telangana News Live August 28, 2024: Zaheerabad Smart City : తెలంగాణకు మెగా ప్రాజెక్టు కేటాయించిన కేంద్రం, జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు-today telangana news latest updates august 28 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live August 28, 2024: Zaheerabad Smart City : తెలంగాణకు మెగా ప్రాజెక్టు కేటాయించిన కేంద్రం, జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు

Zaheerabad Smart City : తెలంగాణకు మెగా ప్రాజెక్టు కేటాయించిన కేంద్రం, జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు

Telangana News Live August 28, 2024: Zaheerabad Smart City : తెలంగాణకు మెగా ప్రాజెక్టు కేటాయించిన కేంద్రం, జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు

04:19 PM ISTAug 28, 2024 09:49 PM HT Telugu Desk
  • Share on Facebook
04:19 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 28 Aug 202404:19 PM IST

Telangana News Live: Zaheerabad Smart City : తెలంగాణకు మెగా ప్రాజెక్టు కేటాయించిన కేంద్రం, జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు

  • Zaheerabad Industrial Smart City : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మెగా ప్రాజెక్టును కేటాయించింది. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటుచేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో రూ.2361 కోట్లతో ఈ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202402:01 PM IST

Telangana News Live: BRS Mlc Kavitha : హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు

  • BRS Mlc Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం సాయంత్రం దిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమె...భారీ ర్యాలీగా తన నివాసానికి చేరుకున్నారు. కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202412:08 PM IST

Telangana News Live: Chevella Congress : చేవెళ్ల కాంగ్రెస్ లో గ్రూప్ వార్...! ఎమ్మెల్యే కాలె యాదయ్య కారుపై కోడిగుడ్లతో దాడి

  • సొంత పార్టీ కార్యకర్తల నుంచి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన ఎదురైంది. షాబాద్ కు వెళ్లిన ఆయన్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన వాహనంపై కోడిగుడ్లతో దాడి చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు... పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటన చేవెళ్ల కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202411:03 AM IST

Telangana News Live: Siddipet District : 20 ఆలయాల్లో చోరీ..! సిద్ధిపేట పోలీసులకు చిక్కిన ముఠా

  • గ్రామ దేవత ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను సిద్ధిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి బంగారం, వెండితో పాటు రెండు బైకులను స్వాధీనం చేశారు. దాదాపు 20 ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఇద్దరిని అరెస్ట్ చేయగా… మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202409:36 AM IST

Telangana News Live: HYDRA : 'హైడ్రా' హైదరాబాద్‌ వరకే పరిమితం... పోలీస్‌ స్టేషన్ స్టేటస్ కూడా ఇస్తాం - సీఎం రేవంత్

  • ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే ‘హైడ్రా’ పరిమితమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. చెరువులు కబ్జా చేసిన ఎవరిని వదిలిపెట్టమని పునరుద్ఘాటించారు. మీడియాతో చిట్‌ చాట్‌లో మాట్లాడిన ఆయన.. రుణమాఫీపై కూడా కీలక ప్రకటన చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202407:33 AM IST

Telangana News Live: Distance Education 2024 : దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు.. దగ్గరపడుతున్న దరఖాస్తుల గడువు, వెంటనే అప్లయ్ చేసుకోండి

  • బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ, కాకతీయ వర్శిటీ దూర విద్య ప్రవేశాల గడువు దగ్గరపడుతోంది. ఈనెల 31వ తేదీతో ఆన్ లైన్ దరఖాస్తుల సమయం ముగియనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిగ్రీ, పీజీతో పాటు డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202406:50 AM IST

Telangana News Live: Karimnagar BRS : మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్..! గరంగరంగా కరీంనగర్ సిటీ పాలిటిక్స్

  • బీఆర్ఎస్ పురుడు పోసుకున్న కరీంనగర్ లో వర్గ విబేధాలు బహిర్గతమయ్యాయి. మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్ గా రాజకీయాలు నడుస్తున్నాయి. స్వపక్షంలోనే విపక్షంగా మారి పరస్పర విమర్శలతో రచ్చ రాజకీయాలు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202406:37 AM IST

Telangana News Live: Telangana Thalli Statue: దొరల ఆనవాళ్లు లేకుండా,తెలంగాణ చరిత్ర ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు…

  • Telangana Thalli Statue: దొరల ఆనవాళ్లు, గడీల పాలన గుర్తుకు రాకుండా, తెలంగాణ చరిత్ర ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిచారు. తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు బుధవారం సీఎం శంకుస్థాపన చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202406:13 AM IST

Telangana News Live: Bear attack : మెదక్ జిల్లాలో ఎలుగుబంటి సంచారం..! పొలం వద్ద రైతుపై దాడి

  • పొలం వద్ద పనులు చేసుకుంటున్న ఓ రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో రైతు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. పక్క పొలంలో పనులు చేసుకుంటున్న మరో ఇద్దరు రైతులు వచ్చి.. ఎలుగుబంటి  దాడి నుంచి కాపాడారు. ఈ దాడి ఘటన మెదక్ జిల్లాలోని హవేళిఘన్పూర్ మండల పరిధిలో జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202405:58 AM IST

Telangana News Live: Samshabad Hotel Spycams: ప్రేమ జంటలకు బెదిరింపులు, లాడ్జి గదుల్లో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు

  • Samshabad Hotel Spycams: శంషాబాద్‌లోని లాడ్జి నిర్వాహకుడు వికృత చర్యలకు పాల్పడటం కలకలం రేపింది.  లాడ్జి గదులకు వచ్చే జంటలను లక్ష్యంగా చేసుకుని సీక్రెట్ కెమెరాలను అమర్చి చిత్రీకరించి,  వాటితో వారిని బెదిరించి సొమ్ము చేసుకోవడం వెలుగు చూసింది. హోటల్లో గది అద్దెకున్న వారి ఫిర్యాదుతో ఈ విషయం బయటపడింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202405:37 AM IST

Telangana News Live: NIT Warangal Jobs 2024 : వరంగల్‌ 'నిట్'లో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు - ముఖ్య వివరాలివే

  • NIT Warangal Recruitment 2024 :వరంగల్‌లోని ‘నిట్’(NIT) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. నాన్ - టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం  పది ఖాళీలను భర్తీ చేయనుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202404:05 AM IST

Telangana News Live: New Osmania Hospital : గోషామహల్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి - 32 ఎకరాల్లో నిర్మాణం

  • ఉస్మానియా ఆసుపత్రిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. గోషామహల్‌లో కొత్త భవనం ఏర్పాటు చేయాలన్నారు. 32 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పుడున్న ఉస్మానియా ఆస్పత్రి చారిత్రక కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202403:12 AM IST

Telangana News Live: Governor In Warangal: ఆదివాసీలు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలన్న గవర్నర్

  • Governor In Warangal: అడవిని నమ్ముకుని జీవించే ఆదివాసీలు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలని, వారి అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సూచించారు.మూడు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202401:38 AM IST

Telangana News Live: sangareddy crime: పుష్ప సినిమా తరహాలో టాటా సఫారీలో సీక్రెట్ ప్లేస్.. 83 కిలోల గంజాయి స్వాధీనం

  • sangareddy crime: పుష్ప సినిమా రేంజ్ లో అక్రమంగా తరలిస్తున్న రూ. 33 లక్షల విలువైన 83. 4 కిలోల ఎండు గంజాయిని, సంగారెడ్డి జిల్లా కంకోల్ చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ని అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202412:30 AM IST

Telangana News Live: Siricilla Police: నక్సలైట్ల పేరుతో సెటిల్ మెంట్ దందాలు…మహిళ కిడ్నాప్‌ కేసులో ఆరుగురి అరెస్ట్

  • Siricilla Police: నక్సల్స్ ముసుగులో సెటిల్ మెంట్ దందాలు నిర్వహించే మాజీ నక్సలైట్ దంపతులతో పాటు ఆరుగురిని రాజన్న సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు.‌ మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ వారు ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటను విడకొట్టేందుకు ప్రియురాలు కిడ్నాప్ కేసుతో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి