తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live August 27, 2024: Cow Illegal Transport : ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ కు 47 గోవుల అక్రమ రవాణా-ఊపిరాడక 10 పశువులు మృతి
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 27 Aug 202411:50 AM IST
Telangana News Live: Cow Illegal Transport : ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ కు 47 గోవుల అక్రమ రవాణా-ఊపిరాడక 10 పశువులు మృతి
- Cow Illegal Transport : ఆసిఫాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా 47 గోవులను తరలిస్తుండగా కరీంనగర్ లో విశ్వహిందూ పరిషత్ సభ్యులు, పోలీసులు పట్టుకున్నారు. లారీలో కుక్కి కుక్కి తీసుకెళ్తుండడంతో ఊపిరి ఆడక 10 గోవులు మృతి చెందాయి. మరో 5 గోవులు మృత్యువుతో పోరాడుతున్నాయి.
Tue, 27 Aug 202410:16 AM IST
Telangana News Live: Kavitha Bail: లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్-కుమ్మక్కు రాజకీయాలు, ఉమ్మడి విజయమంటూ బీజేపీ, కాంగ్రెస్ సెటైర్లు
- Mlc Kavitha Bail : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలని కాంగ్రెస్ విమర్శిస్తే... ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉమ్మడి విజయమని బీజేపీ సెటైర్లు వేస్తుంది.
Tue, 27 Aug 202408:47 AM IST
Telangana News Live: Kavitha Bail Conditions: పాస్‌పోర్ట్ సీజ్, పదిలక్షల పూచీకత్తుతో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు
- Kavitha Bail Conditions: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.166రోజుల తర్వాత లిక్కర్ పాలసీ కేసులో కవితకు బెయిల్ మంజూరైంది.పది లక్షల రుపాయల ష్యూరిటీతో పాటు పాస్ పోస్ట్ స్వాధీనం చేయాలనే నిబంధనలతో బెయిల్ మంజూరు చేసింది.
Tue, 27 Aug 202408:18 AM IST
Telangana News Live: Hydra: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ముప్పు.. భద్రత పెంచిన ప్రభుత్వం
- Hydra: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపట్టిన నేపథ్యంలో.. ముప్పు ఉందని భావించి సెక్యూరిటీని పెంచింది.
Tue, 27 Aug 202408:11 AM IST
Telangana News Live: Nalgonda Farmers: బత్తాయి రైతు ఆగమాగం, ధరలు లేక అల్లాడుతున్న అన్నదాతలు..కనీస ధర కూడా గిట్టుబాటు కాని వైనం
- Nalgonda Farmers: బత్తాయి సాగులో దేశ వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. నాలుగు దశాబ్ధాల కింద జిల్లాలో బత్తాయి సాగు మొదలైన రోజుల్లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో తోటలు ఉంటే.. ఇపుడా విస్తీర్ణం 40వేల ఎకరాలకు తగ్గిపోయింది. పలు కారణాలతో బత్తాయి తోటల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది.
Tue, 27 Aug 202407:40 AM IST
Telangana News Live: Kavitha Bail: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు
- Kavitha Bail: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. గత మార్చిలో ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో అరెస్టైన కవిత అప్పటి నుంచి తీహార్ జైల్లో ఉంటున్నారు దాదాపు ఐదు నెలలుగా పలు మార్లు బెయిల్ కోసం కోర్టుల్ని ఆశ్రయించారు.
Tue, 27 Aug 202407:20 AM IST
Telangana News Live: Driverless Cars: డ్రైవర్ రహిత కారును తయారు చేసిన ఐఐటీ హైదరాబాద్..టెస్ట్ డ్రైవింగ్‌లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు
- Driverless Cars: శాస్త్ర, సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణలు మానవ జీవితాలలో ఊహించని మార్పులను తెచ్చిపెట్టనున్నాయి. డ్రైవర్ లేకుండా నడిచే కార్లను రూపొందించిన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు, దేశంలో రోడ్డు ప్రయాణాన్ని సమూలంగా మార్చడానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు
Tue, 27 Aug 202405:49 AM IST
Telangana News Live: Telangana Rajmudra: తెలంగాణ రాజముద్ర మారిందా..? వరంగల్‌లో అధికారుల అత్యుత్సాహం
- Telangana Rajmudra: వరంగల్‌లో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా తెలంగాణ రాజముద్రనే మార్చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించి.. ఇంకా ఆమోదించని రాజముద్రతో ఫ్లెక్సీ ప్రింట్ చేయించారు. ఇప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
Tue, 27 Aug 202405:12 AM IST
Telangana News Live: vinayaka chavithi 2024: గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారా.. అయితే ఈ రూల్స్ గుర్తుంచుకొండి
- vinayaka chavithi 2024: వినాయక చవితి.. ఊరు..వాడ అంతా ఏకమై ఈ పండుగను జరుపుకుంటారు. గల్లీ గల్లీకో గణేశుడి మండపాన్ని ఏర్పాటు చేసి.. తమ భక్తిని చాటుకుంటారు. అయితే.. ఈ ఉత్సవాల నిర్వహణ సందర్భంగా కొన్ని ఇబ్బందులు జరిగే ఛాన్స్ ఉంది. అందుకే పోలీసులు కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు.
Tue, 27 Aug 202404:02 AM IST
Telangana News Live: MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ.. సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
- MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల ఉత్కంఠ నెలకొంది. బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాధన్ ధర్మాసనం ముందుకు కవిత పిటిషన్ వచ్చింది. విచారణ నేపథ్యంలో.. బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం ఢిల్లీలో మకాం వేసింది.
Tue, 27 Aug 202402:33 AM IST
Telangana News Live: Congress: నామినేటెడ్ పోస్టులపై సీనియర్లు గరంగరం.. పెండింగ్‌లో ఉత్తర్వులు
- Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టులు చిచ్చుపెట్టాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పోస్టులు ఇవ్వడంతో సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా ఓ మంత్రి ఏఐసీసీ నాయకత్వానికి లేఖ రాశారు. ఇప్పుడు ఈ ఇష్యూ కాంగ్రెస్‌లో కాక రేపుతోంది.
Tue, 27 Aug 202401:04 AM IST
Telangana News Live: Rain Alert: తెలంగాణలో మళ్లీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
- Rain Alert: తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 11 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Tue, 27 Aug 202412:36 AM IST
Telangana News Live: Karimnagar: కనుమరుగైన చెరువులు.. ఆగని అక్రమ నిర్మాణాలు
- Karimnagar: బరితెగించిన కోడి బజార్లో గుడ్డు పెట్టిందట. అచ్చం అలానే ఉంది భూ కబ్జాదారుల యవ్వారం. ఓవైపు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంటే.. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూ కబ్జాలు యదేచ్ఛగా సాగుతున్నాయి. దీంతో హైడ్రా హైదరాబాద్‌కే పరిమితం కాకుండా.. జిల్లాలకు విస్తరించాలని జనం కోరుతున్నారు.
Tue, 27 Aug 202411:43 PM IST
Telangana News Live: CMRF Scam: సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. ఆ నియోజకవర్గంపై సీఐడీ ఫోకస్!
- CMRF Scam: తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ స్కామ్ సంచలనంగా మారింది. ఈ స్కామ్‌పై సీఐడీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో.. కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టు తెలుస్తోంది. సదరు మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ముందు విచ్చలవిడిగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారని సమాచారం.