తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live August 26, 2024: Karimnagar News : భారమైన పేగు బంధం, కొడుకులు చూడడంలేదని ఠాణా మెట్లెక్కిన తల్లులు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 26 Aug 202405:02 PM IST
Telangana News Live: Karimnagar News : భారమైన పేగు బంధం, కొడుకులు చూడడంలేదని ఠాణా మెట్లెక్కిన తల్లులు
- Karimnagar News : తిట్టినా, కొట్టినా భరించారు, కనికరిస్తారని ఎదురుచూశారు. కానీ కన్న కొడుకుల్లో మార్పు రాలేదు. గుప్పెడు మెతుకులు పెట్టే నాథుడి లేక రోడ్డున పడ్డారు. చివరకు చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు తల్లులు తమను ఆదుకోవాలని ఠాణా మెట్లెక్కారు.
Mon, 26 Aug 202404:24 PM IST
Telangana News Live: Lower Manair Dam : లోయర్ మానేర్ కు జలకళ, మిడ్ మానేర్ ఐదు గేట్లు ఎత్తివేత
- Lower Manair Dam : కరీంనగర్ లోని లోయర్ మానేర్ డ్యామ్ జలకళ సంతరించుకోబోతుంది. మిడ్ మానేర్ నుంచి నీటిని విడుదల చేసి లోయర్ మానేర్ నింపుతున్నారు. ఐదు గేట్లు ఎత్తి 14600 క్యూసెక్కుల నీటిని ఎల్ఎండీకి విడుదల చేశారు. లోయర్ మానేర్ లో నీటిని చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Mon, 26 Aug 202403:29 PM IST
Telangana News Live: Rythu Runa Mafi : రుణమాఫీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, తప్పుల సవరణలకు మార్గదర్శకాలు జారీ
- Rythu Runa Mafi : రైతు రుణమాఫీ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రుణమాఫీ కాని రైతులు మండల వ్యవసాయాధికారిని కలిసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. తప్పుల సవరణలకు మార్గదర్శకాలు జారీ చేసింది. రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదైనా వ్యవసాయాధికారి స్వీకరిస్తారు.
Mon, 26 Aug 202412:54 PM IST
Telangana News Live: Journalists Houses : జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ డిమాండ్
- Journalists Houses : జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీల జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు జేఏసీ బృందం మీడియా అకాడమీ ఛైర్మన్ ను కలిసి వినతి పత్రం అందించాయి. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో సొసైటీలకతీతంగా కలిసి పోరాడాలని జేఏసీ నిర్ణయించింది.
Mon, 26 Aug 202412:31 PM IST
Telangana News Live: Siddipet: చెట్లను సొంత బిడ్డల్లా పెంచుకున్నాం.. వాటిని నరికేయొద్దు: హరీష్ రావు
- Siddipet: సిద్దిపేటలో అధికారులు, ప్రజా ప్రతినిధులు 20 సంవత్సరాలు కష్టపడి చెట్లను పెంచారని.. వాటిని సొంత బిడ్డల్లా చూసుకున్నామని హరీష్ రావు అన్నారు. వాటిని నరకొద్దని ట్రాన్స్‌కో అధికారులను కోరారు.
Mon, 26 Aug 202412:14 PM IST
Telangana News Live: TTDP : తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం సాధ్యమేనా?
- TTDP : టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణలో టీడీపీ పునర్ వైభవంపై ఫోకస్ పెట్టారు. తరచూ టీటీడీపీ నాయకులతో భేటీ అవుతూ... పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా పార్టీలో తాత్కాలిక కమిటీలన్నీ రద్దు చేశారు. టీటీడీపీకి ఉన్న క్యాడర్ తో పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు చేపడుతు్నారు.
Mon, 26 Aug 202411:49 AM IST
Telangana News Live: Siddipet Robbery : సిద్దిపేటలో పట్టపగలే చోరీ, కూతురింటికి వెళ్లి వచ్చేలా ఇల్లు గుల్ల
- Siddipet Robbery : సిద్దిపేటలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. శ్రీనగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో రెండు ఇళ్లలో చోరీ చేశారు. 14 తులాల బంగారం, 80 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ. 2. 20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
Mon, 26 Aug 202410:27 AM IST
Telangana News Live: Hyderabad: మరీ ఇంత దారుణమా.. ఛార్జర్ కోసం మహిళను చంపిన యువకుడు
- Hyderabad: చిన్న చిన్న విషయాలకు గొడవలు జరిగి.. తీరా అవి చంపుకునే వరకు వెళ్తున్నాయి. తాజాగా హైదరాబాద్ సమీపంలోని దుండిగల్‌లో దారుణం జరిగింది. సెల్ ఫోన్ ఛార్జర్ కోసం ఓ యువకుడు మహిళను మర్డర్ చేశారు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
Mon, 26 Aug 202408:59 AM IST
Telangana News Live: Hyderabad: హైదరాబాద్ సీపీ హెచ్చరిక.. ఇకపై ఉక్కుపాదం మోపుతాం అంటూ వార్నింగ్
- Hyderabad: రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. తెలంగాణలో డ్రగ్స్ మాటే వినపడొద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో పోలీసులు డ్రగ్స్ వినియోగం, అమ్మకం పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Mon, 26 Aug 202408:27 AM IST
Telangana News Live: Hydra: కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.. అక్బరుద్దీన్ ఓవైసీ కీలక కామెంట్స్
- Hydra: హైడ్రా కూల్చివేతలపై రాజకీయ నాయకులు వరుసగా స్పందిస్తున్నారు. తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై రియాక్ట్ అయిన ఓవైసీ.. కీలక కామెంట్స్ చేశారు.
Mon, 26 Aug 202407:42 AM IST
Telangana News Live: rythu runa mafi: రుణమాఫీ కాలేదా..? రేపటి నుంచే సర్వే.. తాజా అప్‌డేట్ ఇదే..
- rythu runa mafi: అర్హులైనా రుణ మాఫీ కానీ రైతుల వివరాలు నమోదు చేసేందుకు సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 27వ తేదీ (మంగళవారం) నుంచి ఈ సర్వే జరగనుంది. దీని కోసం రైతుభరోసా పంట రుణ మాఫీ యాప్‌ను రూపొందించారు.
Mon, 26 Aug 202406:49 AM IST
Telangana News Live: CMRF Scam: తెలంగాణలో మరో సంచలనం.. సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో 28 ఆస్పత్రులపై కేసు నమోదు
- CMRF Scam: తెలంగాణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సీఎంఆర్ఎఫ్ నిధుల కోసం నకిలీ బిల్లులు సృష్టించి సర్కారుకు టోపీ పెట్టారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. తాజాగా సీఐడీ 28 ఆస్పత్రులపై కేసు నమోదు చేసింది.
Mon, 26 Aug 202405:36 AM IST
Telangana News Live: Suryapet: స్విమ్మింగ్‌పూల్‌లో పడి.. అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి
- Suryapet: తెలంగాణకు చెందిన మరో వ్యక్తి అమెరికాలో మృతిచెందారు. ఇటీవల రాజేష్ అనే యువకుడు మృతిచెందగా.. తాజాగా సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రవీణ్ చనిపోయారు. ప్రవీణ్ మృతితో పాతర్లపహాడ్ గ్రామంలో విషాదం నెలకొంది.
Mon, 26 Aug 202405:06 AM IST
Telangana News Live: Alampur Tragedy: అలంపూర్‌లో విషాదం.. విరిగిపడిన కరెంట్ స్తంభం.. బాలుడు మృతి
- Alampur Tragedy: జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. కరెంట్ స్తంభం విరిగిపడి ఓ బాలుడు మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు తనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Mon, 26 Aug 202404:31 AM IST
Telangana News Live: snoring treatment: గురక సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇక్కడికి వెళ్లండి!
- snoring treatment: ప్రస్తుతం చాలామంది గురక సమస్యతో బాధపడుతున్నారు. గురక ఉన్నవారే కాకుండా.. పక్కన ఉండేవారి నిద్ర కూడా చెడిపోతుంది. దీంతో ఎంతోమంది చుట్టాల ఇళ్లకు వెళ్లాలన్న భయపడుతుంటారు. అలాంటి గుడ్ న్యూస్ చెప్పింది నిమ్స్.
Mon, 26 Aug 202401:02 AM IST
Telangana News Live: Son killed Mother: భార్యకు రెండో పెళ్లితో తల్లిని హత్య చేసిన తనయుడు, నల్గొండ జిల్లాలో దారుణం..
- Son killed Mother: నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. భార్యకు జరుగుతున్న రెండో పెళ్లిని కుటుంబ సభ్యులు మద్దతుగా నిలవడాన్ని సహించలేని తనయుడు కన్నతల్లిని హతమార్చాడు. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లికి వెళ్లిన వారు ఇంటికి తిరిగి వచ్చేలోపు విగతజీవులుగా మారిన ఘటన మహబూబ్‌నగర్‌లో జరిగింది.