Telangana News Live August 25, 2024: Karimnagar : హైడ్రా లాగా కరీంనగర్ లో కాడ్రా ఏర్పాటు, సీఎంను విజ్ఞప్తి చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 25 Aug 202405:15 PM IST
- Karimnagar : హైదరాబాద్ లో హైడ్రా కబ్జాదారులను హడలెత్తిస్తుంది. హైడ్రా తరహాలో కరీంనగర్ లో కాడ్రా ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలు కూల్చివేసి చెరువులను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులను కలిసి ఈ విషయంపై విజ్ఞప్తి చేయాలని కాంగ్రెస్ నేతలు సైతం సన్నాహాలు చేస్తున్నారు.
Sun, 25 Aug 202404:01 PM IST
- Nagarjuna On N Convention : మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై హీరో నాగార్జున మరోసారి స్పందించారు. ఎన్ కన్వెన్షన్ పట్టా భూమిలో నిర్మించామని, ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదన్నారు. ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని అభిమానులను కోరారు.
Sun, 25 Aug 202403:36 PM IST
- HYDRA : అక్రమ నిర్మాణదారుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెట్టిస్తుంది. హైదరాబాద్ పరిధిలోని 18 చోట్లు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించి 43.94 ఎకరాలను రికరవరీ చేసింది. ఇందులో ప్రముఖులకు చెందిన భవనాలు కూడా ఉండడం గమనార్హం.
Sun, 25 Aug 202412:42 PM IST
- TGSRTC: ఉరుకుల పరుగుల జీవితంలో అంతా హడావుడే. ప్రయాణాలు చేసేటప్పుడు కంగారుగా ఎక్కి, దిగి పోతుంటారు. ఆ సమయంలో విలువైన వస్తువులను మర్చిపోతుంటారు. అలా పోయిన వస్తువు దొరకడం కష్టమే. కానీ పోయిన వస్తువు తిరిగి దొరికితే ఆ సంతోషం మాటల్లో చెప్పలేరు. ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో జరిగింది.
Sun, 25 Aug 202412:19 PM IST
- Hyderabad: హైడ్రా కూల్చివేతలపై పొలిటికల్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. గతంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పరోక్ష వ్యాఖ్యలు చేయగా.. తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ డైరెక్ట్ గానే ఎటాక్ చేశారు. ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించారు. ఓవైసీ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీశాయి.
Sun, 25 Aug 202411:38 AM IST
- Love on wife: ఈ కాలంలో భార్యభర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి.. పోలీస్ స్టేషన్ల వరకు వస్తున్నారు. అలాంటిది ఓ భర్త తన భార్యపై ఉన్న ప్రేమను మర్చిపోలేకపోతున్నారు. దురదృష్టవశాత్తు తన భార్య చనిపోగా.. ఆమె సమాధిపై ప్రేమ చిహ్నాన్ని నిర్మించాడు.
Sun, 25 Aug 202411:11 AM IST
- TG Caste Census : తెలంగాణ స్థానిక ఎన్నికలకు సందిగ్దత కొనసాగుతోంది. కుల గణన పూర్తి చేశాకే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా కామారెడ్డి డిక్లరేషన్ లో కులగణన చేపడతామని ప్రకటించింది. కులగణన జరిగాక 42 శాతం రిజర్వేషన్ తో ఎన్నికలు నిర్వహించాలని నేతలు అంటున్నారు.
Sun, 25 Aug 202409:26 AM IST
- N Convention: ఎన్ కన్వెన్షన్‌ను అక్రమంగా నిర్మించారని హైడ్రా అధికారులు కూల్చేశారు. దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనా.. తాజాగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లిళ్ల, ఇతర ఫంక్షన్ల కోసం ఎన్ కన్వెన్షన్‌ను బుక్ చేసుకున్న వారు బయటకు వస్తున్నారు. అడ్వాన్స్ డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు.
Sun, 25 Aug 202408:30 AM IST
- IRCTC Hyderabad To Thailand : ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ కు ఎయిర్ టూర్ ప్యాకేజీ అందిస్తుంది. 4 రోజుల టూర్ ప్యాకేజీలో బ్యాంకాక్, పటాయాలో పర్యటించవచ్చు. తదుపరి టూర్ సెప్టెంబర్ 26-29 తేదీల్లో అందుబాటులో ఉంది.
Sun, 25 Aug 202407:52 AM IST
- చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు. అక్రమ నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లో వదిలేసేదే లేదన్నారు. ఒత్తిడి వచ్చినా, మిత్రులవి ఉన్నా భరతం పట్టి తీరుతామన్నారు. హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పిలుపునిచ్చారు.
Sun, 25 Aug 202407:09 AM IST
- Hydra: హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట. అందుకు కారణం హైడ్రా దూకుడే. అవును.. హైడ్రా దూకుడుతో అక్రమార్కులకు కింటిమీద కునుకు లేకుండా పోతోంది. అయితే.. హైడ్రా పనితీరు గురించి తాజాగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Sun, 25 Aug 202406:11 AM IST
- Balapur Murder: బాలాపూర్‌లో బీటెక్ విద్యార్థి హత్య సంచలనం సృష్టించింది. పట్టపగలే మర్డర్ జరగడంతో పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. స్పెషల్ టీం ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. అయితే.. ఈ హత్యకు కారణం ఇప్పుడు కీలకంగా మారింది.
Sun, 25 Aug 202404:56 AM IST
- Hyderabad: హైదరాబాద్‌లో మరో కీలక పరిణామం జరిగింది. శనివారం ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసిన ఘటన మురువక ముందే మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. అక్రమార్కుల భరతం పడుతున్నారు. తాజాగా మణికొండలో ఇటీవల నిర్మించిన 225 విల్లాలకు నోటీసులు ఇచ్చారు.
Sun, 25 Aug 202404:46 AM IST
- హైదరాబాద్ లోని మధురానగర్ లో దారుణం వెలుగు చూసింది. దొంగతనం చేయడానికి వచ్చిన యువకుడిపై ఓ పండ్ల వ్యాపారి ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. దెబ్బల దాటికి సదరు యువకుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయాడు.
Sun, 25 Aug 202401:51 AM IST
- వరంగల్ నగరంలోనూ ‘హైడ్రా’ తరహా వ్యవస్థకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. నగరంలో ఉన్న చెరువులను కాపాడే ఉద్దేశ్యంతో వరంగల్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మానిటరింగ్ అథారిటీ(వాడ్రా)ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. . తొందర్లోనే ‘వాడ్రా’ కార్యరూపం దాల్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Sun, 25 Aug 202401:05 AM IST
టీజీ ఐసెట్ - 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి నుంచి 11వరకు వెబ్‌ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 14న తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు.
Sun, 25 Aug 202411:45 PM IST
- 'హైడ్రా'.. ఇప్పుడు దీనిచుట్టే చర్చ అంతా..! ఏర్పాటైన కొద్దిరోజుల్లోనే దూకుడుగా ముందుకెళ్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలను బుల్డోజ్ చేసే పనిలో పడింది. పాత, కొత్త అనే తేడా లేకుండా... కబ్జా అని తేలితే చాలు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది. అసలు హైడ్రా ఏంటి..? విధివిధానాలెంటో చూద్దాం..!