Telangana News Live August 24, 2024: KTR Rakhi : కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులు, నోటీసులు ఇవ్వాలని ఛైర్ పర్సన్ ఆదేశాలు-today telangana news latest updates august 24 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live August 24, 2024: Ktr Rakhi : కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులు, నోటీసులు ఇవ్వాలని ఛైర్ పర్సన్ ఆదేశాలు

KTR Rakhi : కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులు, నోటీసులు ఇవ్వాలని ఛైర్ పర్సన్ ఆదేశాలు

Telangana News Live August 24, 2024: KTR Rakhi : కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులు, నోటీసులు ఇవ్వాలని ఛైర్ పర్సన్ ఆదేశాలు

04:58 PM ISTAug 24, 2024 10:28 PM HT Telugu Desk
  • Share on Facebook
04:58 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 24 Aug 202404:58 PM IST

Telangana News Live: KTR Rakhi : కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులు, నోటీసులు ఇవ్వాలని ఛైర్ పర్సన్ ఆదేశాలు

  • KTR Rakhi : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాఖీలు కట్టడంపై సభ్యులపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాఖీకట్టిన ఆరుగురు సభ్యులకు నోటీసులు జారీచేయాలని కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆదేశించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కమిషన్ సభ్యులు రాఖీలు కట్టడం సరికాదన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202404:17 PM IST

Telangana News Live: Cyber Crime : ప్రభుత్వ ఉద్యోగిని బురిడీకొట్టించిన సైబర్ నేరగాళ్లు, పోలీసుల పేరుతో ఫేక్ కాల్ చేసి మోసం

  • Cyber Crime : కరీంనగర్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలకు చిక్కారు. విదేశాల్లో ఉన్న మీ కొడుకు గంజాయి కేసులో పట్టుపడ్డాడని ఫోన్ రావడంతో కంగారు పడి రూ.50 వేలు పంపించారు. తీరా కొడుక్కి ఫోన్ చేయగా ఏ కేసు లేదని చెప్పడంతో మోసపోయానని తెలుసుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202402:59 PM IST

Telangana News Live: TGSRTC : ఆర్టీసీకి పండుగ, ప్రయాణికుల రద్దీతో పెరిగిన ఆదాయం

  • TGSRTC : మహిళల ఉచిత ప్రయాణంతో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. దీంతో పండుగల వేళ ఆదాయం పెరుగుతోంది. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా కరీంనగర్ రీజియన్ లో రూ.12.34 కోట్ల ఆదాయం వచ్చిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202402:09 PM IST

Telangana News Live: Medak News : మెదక్ జిల్లాలో విషాదం, పాముకాటుకు గురై 7వ తరగతి బాలిక మృతి

  • Medak News : మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాముకాటులో 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో బాలిక పాము కాటుకు గురైంది. వెంటనే తల్లిదండ్రులు మెదక్ ఆసుపత్రికి తరలించినా ఫలితంలేకపోయింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202401:54 PM IST

Telangana News Live: Siddipet Crime : ములుగులో డ్రగ్స్ కిట్లతో టెస్టింగ్, స్పాట్ లోనే ఇద్దరి అరెస్టు

  • Siddipet Crime : సిద్దిపేట జిల్లా ములుగులో గంజాయి సేవించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షించి ఇద్దరు యువకులు అక్కడికక్కడే అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 100 నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ కిట్లు పంపిణీ చేశామని పోలీసులు తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202412:57 PM IST

Telangana News Live: TGSRTC Jobs: మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన.. ఆర్టీసీలో ఉద్యోగాలకు రెడీ అవ్వండి!

  • TGSRTC Jobs: మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ప్రగతి చక్రం అవార్డులు పొందుతున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు చెప్పారు. మరిన్ని కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్టు వెల్లడించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202412:28 PM IST

Telangana News Live: AV Ranganath :జీహెచ్ఎంసీ అనుమతులు లేవు, హైకోర్టును తప్పుదోవ పట్టించారు-ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఏవీ రంగనాథ్ రియాక్షన్

  • HYDRA AV Ranganath : హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. తుమ్మడికుంట అక్రమ నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటన్నారు. ఎన్ కన్వెన్షన్ కు జీహెచ్ఎంసీ అనుమతులు లేవన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పై ఎన్ కన్వెన్షన్ హైకోర్టును తప్పుదోవ పట్టిందని తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202411:27 AM IST

Telangana News Live: TG Govt DA Hike : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్-త్వరలోనే రెండు డీఏలు విడుదల?

  • TG Govt DA Hike : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏల్లో రెండింటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డీఏ చెల్లింపుల వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారని సమాచారం.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202411:14 AM IST

Telangana News Live: Warangal: నడిరోడ్డుపై 9 ఎంఎం గన్.. ఎవరికైనా దొరికితే ఏంటీ పరిస్థితి!

  • Warangal: సమయం తెల్లవారుజామున 5 గంటలు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆ సమయంలో సీఆర్పీఎప్ పోలీసుల వాహనం ఆ రోడ్డు గుండా వెళ్లింది. అప్పుడు వారికి చెందిన 9 ఎంఎం గన్ రోడ్డుపై పడిపోయింది. అది ఓ ఆటో డ్రైవర్‌కు దొరికింది. ఈ ఘటన వరంగల్ నగరంలో జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202409:01 AM IST

Telangana News Live: Nagarjuna : హీరో నాగార్జునకు బిగ్ రిలీఫ్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

  •  Nagarjuna : హీరో నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202407:30 AM IST

Telangana News Live: Nagarjuna Reaction: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన నాగార్జున..

  • Nagarjuna Reaction: హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున స్పందించారు. చెరువు భూమిని ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. ఈ కూల్చివేతపై తాము కోర్టు ఆశ్రయిస్తామని నాగార్జున స్పష్టం చేశారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202407:15 AM IST

Telangana News Live: N Convention: ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా ఎందుకు కూల్చేసింది.. అసలు కథ ఇదీ!

  • N Convention: హైదరాబాద్‌లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చేశారు. అయితే.. అసలు ఎన్ కన్వెన్షన్‌ను ఎందుకు కూల్చారు.. కారణాలు ఏంటి.. 2015 నుంచి ఇప్పటి దాకా ఎలా నడిపించారు అనే చర్చ జరుగుతోంది. అసలు ఎన్ కన్వెన్షన్ కథ ఏంటో ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202406:44 AM IST

Telangana News Live: Complaint On N - Convention : మంత్రి ఫిర్యాదుతో కదిలిన 'హైడ్రా' - N కన్వెన్షన్ కూల్చివేతలో కీలక విషయాలు

  • ఎన్- కన్వెన్షన్ నిర్మాణంపై హైడ్రా చర్యలు చేపట్టడం సంచలనంగా మారింది. ఇవాళ ఉదయమే అధికారులు కన్వెన్షన్ సెంటర్ కు వద్దకు చేరుకుని కూల్చివేయించారు. అయితే ఎన్ - కన్వెన్షన్ నిర్మాణంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి … ముఖ్యమంత్రితో పాటు హైడ్రాకు ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202406:24 AM IST

Telangana News Live: Revanth Reddy on N Convention: ఎన్ కన్వెన్షన్‌పై నాడు నేడు అదే మాట.. దటీజ్ రేవంత్..!

  • Revanth Reddy on N Convention: హైదారాబాద్‌లోని హైటెక్ సీటి రోడ్డులో ఉన్న ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా టీమ్ నేలమట్టం చేసింది. ఈ ఇష్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది. రేవంత్ రెడ్డి 2016లో ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమని.. దానిపై ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202406:04 AM IST

Telangana News Live: Hyderabad Metro Parking : పెయిడ్ పార్కింగ్ నిర్ణయం వాయిదా..! ఎల్‌అండ్‌టీ మరో ప్రకటన

  •  ఉచిత పార్కింగ్ విషయంపై ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో మరోసారి కీలక అప్డేట్ ఇచ్చింది.  నాగోల్‌, మియాపూర్‌ మెట్రో రైలు డిపోల వద్ద పెయిడ్ పార్కింగ్  నిర్ణయాన్ని వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202405:18 AM IST

Telangana News Live: Telangana Congress : బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో ఆ ఇద్దరు నేతలు..? కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ

  • తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలిసింది. ఈసారి బీసీ నేతనే ఈ పదవి వరించే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం ఇద్దరు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. ఏ క్షణమైనా కొత్త పీసీసీ చీఫ్ నియమాకానికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని హస్తం వర్గాలు చెబుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202405:17 AM IST

Telangana News Live: warangal collector: వరంగల్ కలెక్టర్ సత్య శారద.. అందరికీ ఆదర్శం

  • warangal collector: ప్రస్తుతం చాలా హాస్టళ్లలో అనేక సమస్యలున్నాయి. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ.. వరంగల్ కలెక్టర్ సత్య శారద మాత్రం అలా కాదు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తూనే.. వారిని ప్రోత్సహిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202404:17 AM IST

Telangana News Live: Srisailam Boat Tour: కృష్ణా జ‌లాల‌పై 90 కిలోమీటర్లు.. మధురానుభూతినిచ్చే లాంచీ ప్రయాణం

  • Srisailam Boat Tour: కృష్ణా జ‌లాల‌పై ఊయ‌లలూగుతూ.. ఎత్తయిన కొండలు.. అరుదైన వన్యప్రాణులు.. ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ సాగే పడవ ప్రయాణం మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తుంది. సోమ‌శిల నుంచి శ్రీ‌శైలం వ‌ర‌కూ సాగే లాంచీ ప్ర‌యాణం.. ఎంతో ఆనందాన్నిస్తుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202403:30 AM IST

Telangana News Live: N Convention : హైడ్రా దూకుడు..! హీరో నాగార్జునకు చెందిన 'ఎన్ కన్వెన్షన్' కూల్చివేత

  • మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత ప్రారంభమైంది. హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నిర్మించారని ఫిర్యాదు అందటంతో చర్యలు చేపట్టారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 24 Aug 202411:48 PM IST

Telangana News Live: BRAOU Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు - దరఖాస్తుల గడువు పొడిగింపు

  • Ambedkar Open University Admissions 2024: డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలకు సంబంధించి డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ మరో అప్డేట్ ఇచ్చింది. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును ఆగస్టు 31వ తేదీకి పొడిగించింది. అర్హులైన అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి