TS Gurukulam : అలర్ట్.. టీజీటీ దరఖాస్తులకు నేడే ఆఖరు, వెంటనే అప్లయ్ చేసుకోండి-today last date for trained graduate teacher jobs applications ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Gurukulam : అలర్ట్.. టీజీటీ దరఖాస్తులకు నేడే ఆఖరు, వెంటనే అప్లయ్ చేసుకోండి

TS Gurukulam : అలర్ట్.. టీజీటీ దరఖాస్తులకు నేడే ఆఖరు, వెంటనే అప్లయ్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Published May 27, 2023 11:51 AM IST

Telangana Gurukulam Job Updates 2023: గురుకులంలోని టీజీటీ(TGT) ఉద్యోగాల దరఖాస్తుల గడువు ఇవాళ్టి(మే 27)తో ముగియనుంది. అయితే గడువు పొడిగిస్తారా లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

టీజీటీ ఉద్యోగాలకు నేడే లాస్ట్
టీజీటీ ఉద్యోగాలకు నేడే లాస్ట్

Telangana Gurukulam TGT Jobs 2023: చాలా రోజులుగా ఎదురుచూస్తున్న గురుకులాల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 9,231 పోస్టులను భర్తీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 4006 టీజీటీ పోస్టులను భర్తీ చేస్తారు. అయితే ఇందుకు సంబంధించిన దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటికే లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 28 నుంచి టీజీటీ దరఖాస్తులను స్వీకరిస్తుండగా… ఇవాళ సాయంత్రం 5 గంటలకు టైం ముగియనున్నది. గురుకులాల్లో అన్ని విభాగాల ఉద్యోగాల కంటే టీజీటీ పోస్టులే అత్యధికంగా ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 300 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్‌ ఎబిలిటీస్‌, ఇంగ్లీష్‌ పరిజ్ఞానంపై 100 మార్కులు ఉంటాయి. ఇక పేపర్‌-2లో బోధన పద్ధతులపై 100మార్కులు కేటాయించారు. పేపర్‌-3లో సబ్జెక్టు విషయ పరిజ్ఞానంపై 100 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. అర్హత వయసు 18 నుంచి 44 ఏళ్లుగా నిర్ణయించారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు ఆ వివరాలను కింద ఇచ్చిన పీడీఎఫ్ లో చూడొచ్చు. ఎంపికైన వారికి స్కేల్ ఆఫ్ పే రూ.42,300 - రూ.1,15,270 ఉంటుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. www.treirb.telangana.gov.in మరోవైపు గురుకుల ఉద్యోగాల్లోనూ ఓటీఆర్ విధానాన్ని తీసుకొచ్చారు. ఒక్కసారి వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలైనప్పుడు ఓటీఆర్ ఎంట్రీ చేస్తే సులభంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. ఫొటో, సంతకం, విద్యార్హతలు వంటివి వివరాలను ప్రతిసారి నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా దరఖాస్తు ప్రక్రియ సింపుల్ గా పూర్తి అవుతుంది. ఈ తరహాలోనే గురుకులాల ఉద్యోగాల భర్తీలోనూ ఓటీఆర్ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. ఫలితంగా ఎన్ని నోటిఫికేషన్లకు అప్లై చేసుకున్నా.. వ్యక్తిగత వివరాలను మళ్లీ మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు.

గురుకులాల్లో భర్తీ చేసే మొత్తం పోస్టుల వివరాలు :

జూనియ‌ర్ లెక్చరర్‌, లైబ్రేరియన్‌, పీడీ - 2008

డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్‌ - 868

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) -1276

ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ) 4006

లైబ్రేరియ‌న్ స్కూల్- 434

పీజిక‌ల్ డైరెక్టర్స్‌ ఇన్ స్కూల్ - 275

డ్రాయింగ్ టీచ‌ర్స్ ఆర్ట్ టీచ‌ర్స్ -134

క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌ క్రాఫ్ట్ టీచ‌ర్స్- 92

మ్యూజిక్ టీచ‌ర్స్- 124

Whats_app_banner

సంబంధిత కథనం