Hyderabad : ఎల్బీ నగర్ లో విషాదం - సెల్లార్‌లో కూలిన మట్టి దిబ్బలు, ముగ్గురు మృతి
Wall Collapsed in LB Nagar : హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. సెల్లార్ తవ్వకాల్లో మట్టి దిబ్బలు కుప్పకూలటంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి గాయపడ్డాడు.
మట్టి దిబ్బలు కుప్పకూలి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో జరిగింది. ఓ భవనం సెల్లార్ తవ్వకాల్లో మట్టి దిబ్బలు కూలటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను బిహార్ కూలీలుగా గుర్తించారు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

ప్రాథమిక వివరాల ప్రకారం…. ఓ భవన నిర్మాణానికి సంబంధించి సెల్లార్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ పలువురు కార్మికులు పని చేస్తున్నారు. మట్టిని తవ్వుతుండగా…. మట్టి దిబ్బలు ఒక్కసారిగి కుప్పకూలాయి. దీంతో ముగ్గురు కార్మికులు స్పాట్ లోనే చనిపోయారు. మట్టి దిబ్బలను తొలగించి వారి మృత దేహాలను బయటికి వెలికి తీశారు. వీరంతా కూడా బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.