Meerpet Murder Case : మీర్‌పేట మహిళ హత్య కేసులో మరో ముగ్గురు.. పరారీలో నిందితులు!-three more accused in hyderabad meerpet woman murder case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Meerpet Murder Case : మీర్‌పేట మహిళ హత్య కేసులో మరో ముగ్గురు.. పరారీలో నిందితులు!

Meerpet Murder Case : మీర్‌పేట మహిళ హత్య కేసులో మరో ముగ్గురు.. పరారీలో నిందితులు!

Basani Shiva Kumar HT Telugu
Published Feb 10, 2025 09:54 AM IST

Meerpet Murder Case : భార్యను అతి కిరాతకంగా హత్య చేసి.. డెడ్ బాడీని ముక్కలు ముక్కలు చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఈ ఘటనలో గురుమూర్తి తోపాటు.. మరో ముగ్గురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం ఈ ముగ్గురు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

మీర్‌పేట మహిళ హత్య కేసు
మీర్‌పేట మహిళ హత్య కేసు

హైదరాబాద్‌ మీర్‌పేటలో మహిళ హత్య ఘటన సంచలనం సృష్టించింది. భార్యను మర్డర్ చేసి.. డెడ్ బాడీని ముక్కలుగా చేసి మాయం చేశాడు భర్త. ఈ కేసులో నిందితుడు గురుమూర్తితో పాటు మరో ముగ్గురి పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. గురుమూర్తి సోదరి సుజాత, తల్లి సుబ్బలక్ష్మమ్మ, సోదరుడు కిరణ్‌లను నిందితులుగా చేర్చినట్టు పోలీసులు వెల్లడించారు.

గృహహింస చట్టం కింద..

ప్రధాన నిందితుడు గురుమూర్తిపై హత్యకు సంబంధించి సెక్షన్లు నమోదు చేయగా.. మిగిలిన ముగ్గురిపై బీఎన్‌ఎస్‌లోని 85 సెక్షన్‌‌ను నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి.. భార్య, ఇద్దరు పిల్లలతో రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం జిల్లెలగూడలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే గతనెల 16న హత్య జరిగింది.

కారణం ఇదీ..

గురుమూర్తి, అతని భార్య మధ్య గొడవలు జరిగాయి. దీంతో భార్య పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించినంది. ఈ కారణంగా తన సొంతూరుకి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయని గురుమూర్తి జనవరి 16న భార్యను చంపేశాడు. డెడ్ బాడీని ముక్కలు ముక్కలు చేసి నీళ్లలో ఉడికించాడు. ఈ సమయంలో పక్కింట్లో, పైన అద్దెకు ఉంటున్న వారికి అనుమానం వచ్చింది. గురుమూర్తిని ప్రశ్నించగా.. మాంసం కూర వండుతున్నట్లు చెప్పాడు.

వారంపాటు వెతికించగా..

జిల్లెలగూడ చెరువులో వారంపాటు గజ ఈతగాళ్లతో వెతికించగా.. మాంసం ముక్కలను తీసుకెళ్లిన బకెట్‌ లభించినట్లు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించి.. కుటుంబాన్ని రోడ్డుపైకి లాగిందంటూ మాధవిని గురుమూర్తి కుటుంబ సభ్యులు వేధించారని.. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వారి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్టు పోలీసులు స్పష్టం చేశారు.

హత్యకు ముందు..

హత్యకు ముందు గురుమూర్తి కామెడీ థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’ సినిమాను ఓటీటీలో చూశాడు. ఆ సినిమాలో ఉన్నట్టు మాధవిని హత్యచేసి.. ఆధారాలు మాయం చేయాలనుకున్నాడు. సూక్ష్మదర్శిని సినిమాలో ఇంట్లో వారి మాట వినకుండా పెళ్లి చేసుకుని.. బాలికను దత్తత తీసుకున్న కూతురిని.. ఆమె తల్లి కొడుకుతో కలిసి హత్య చేస్తుంది. శవాన్ని మాయం చేయడానికి ఇంట్లో చిన్న నీళ్ల ట్యాంకు ఏర్పాటు చేస్తుంది. అందులో యాసిడ్‌, రసాయనాలు కలిపి శవాన్ని ఆ ట్యాంకులో వేస్తారు. యాసిడ్‌, రసాయనాలు శవాన్ని కరిగించి ద్రవంగా మార్చేస్తాయి. ఆ నీటిని వాష్‌ రూమ్‌ ద్వారా ఫ్లష్‌ చేసేస్తారు. కరిగిపోని ఎముకలను చిన్న చిన్న ముక్కలుగా చేసి.. ఆ తర్వాత పొడి చేసి ఫ్లష్‌ ద్వారా డ్రైనేజీలోకి వదిలేస్తారు. గురుమూర్తి కూడా ఇలాగే ప్లాన్ చేశాడు.

Whats_app_banner