Hyderabad Bike thefts: ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముగ్గురి అరెస్ట్-three minors were arrested for stealing bikes in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Bike Thefts: ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముగ్గురి అరెస్ట్

Hyderabad Bike thefts: ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముగ్గురి అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Feb 02, 2024 12:55 PM IST

Hyderabad Bike thefts: హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న ముగ్గురు మైనర్లను చార్మినార్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

బైకులు చోరీ చేస్తున్న నిందితుల అరెస్ట్
బైకులు చోరీ చేస్తున్న నిందితుల అరెస్ట్

Hyderabad Bike thefts: దొంగతాళాలతో నగరంలో బైక్‌ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు.

వ్యసనాలకు బానిసలైన ముగ్గురు మైనర్లు దొంగ తాళాలతో పార్కింగ్ చేసిన బైకులనే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు చార్మినార్ ఏసిపి రుద్ర భాస్కర్ వెల్లడించారు.

చోరీ చేసిన బైకులను గోల్కొండ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అబ్దుల్లా ఖాన్ అలియాస్ అబ్దుల్ (19 కు ఇస్తున్నట్లు తెలిపారు.వీటిని లంగర్ హౌస్ లోని మొహమ్మద్ ఖాన్ (28),గోల్కొండ కు చెందిన ఇమ్రాన్ (34), మొహమ్మద్ అబ్దుల్లా ఖాన్‌లు స్క్రాప్ గా మార్చి....అమ్ముకుంటున్నారని ఏసిపి వివరించారు.

మైనర్లకు కొంత డబ్బులు ఇచ్చి బైకులు దొంగతనాలకు ఇమ్రాన్ మరియు అబ్దుల్లా ఖాన్ ప్రేరేపించారని ఏసిపి చెప్పారు.దీంతో ముగ్గురు బాలుర తో పాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.2.20 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్…

చైన్ స్నాచింగ్ చేస్తున్న ఇద్దరి నిందితులను గురువారం అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల క్రితం అపోలో ఆసుపత్రిలో పనిచేసే ఓ మహిళ హైదరగుడా ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా... గుర్తుతెలియని ఇద్దరి వ్యక్తులు బైక్ పై వచ్చి మహిళా ఫోన్ లాక్కొని పరారయ్యారు.

దీంతో బాధిత మహిళా అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి గురువారం ఉదయం అబిడ్స్ లోని ఓ హోటల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న పాతబస్తీ ప్రాంతానికి చెందిన ఇబ్రహీం, షేక్ రహిల్ ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు వారిని తమదైన స్టైల్ లో విచారించగా... ఫోన్ స్నాచింగ్ చేసినట్లు ఒప్పుకున్నారు. ఇదే విధంగా గతంలో కూడా నగరంలోని ఫలక్ నామ పీఎస్ లో ఒక చోరీ, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు స్నాచింగ్ కేసులు, నారాయణగూడ పిఎస్ పరిధిలో ఒక స్నాచింగ్ కేసు, గాంధీనగర్ పిఎస్ పరిధిలో మరో స్నాచింగ్ కేసు నిందితుల పై నమోదు అయినట్లు పోలీసులు విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి ఒక సెల్‌ఫోన్‌, నెంబర్ ప్లేట్ లేని ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు.

మహిళతో అసభ్య ప్రవర్తన…

మహిళ మెడలోంచి చైన్ స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించి విఫలమైన యువకుడు ఆ మహిళా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలో నివాసం నుండి మహిళ ఓ ప్రైవేట్ కాలేజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తుంది. బుధవారం 11 గంటలకు ఆంజనేయ స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న రోడ్డు గుండా ఆ మహిళ నడుచుకుంటూ వెళుతుంది.

అటుగా వచ్చిన ఓ గుర్తు తెలియని యువకుడు సదరు మహిళ మెడ లో నుంచి చైన్ దొంగలించేందుకు ప్రయత్నం చేయగా ఆమె గట్టిగా పట్టుకుంది దీంతో దొంగతనం చేయడానికి వీలు కాలేదు. దాంతో మహిళను అసభ్యకరంగా కొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు మధుర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)