నాగార్జున సాగర్ హైవేపై ఘోర ప్రమాదం - కారును ఢీకొట్టిన బస్సు, ముగ్గురు మృతి-three killed in road accident on sagar highway in rangareddy district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  నాగార్జున సాగర్ హైవేపై ఘోర ప్రమాదం - కారును ఢీకొట్టిన బస్సు, ముగ్గురు మృతి

నాగార్జున సాగర్ హైవేపై ఘోర ప్రమాదం - కారును ఢీకొట్టిన బస్సు, ముగ్గురు మృతి

నాగార్జునసాగర్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలో ఓ కారును ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

సాగర్ హైవేపై రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండల పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. మాల్ సమీపంలోని తమ్మలోనిగూడ గేట్ ఓ కారును ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా… మరో ముగ్గురు గాయపడ్డారు. సాయి తేజ, పవన్ కుమార్, రాఘవేంద లను మృతులుగా గుర్తించారు.

ఏం జరిగిందంటే…?

హైదరాబాద్ లో ఉంటున్న ఆరుగురు స్నేహితులు వైజాగ్ కాలనీకి వెళ్లారు. అక్కడ్నుంచి తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా… వీరి కారు ప్రమాదానికి గురైంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో… ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కూడా మహబూబ్ నగర్ కు చెందిన వాళ్లు కాగా… హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిసింది.

ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంటుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.