మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మరిపెడ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం - వరంగల్ హైవేలోని ఎల్లంపేట స్టేజీ వద్ద ఇవాళ తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కాగా… పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.