నీ బుల్లెట్ బండెక్కి వచ్చెత్తా పా.. పాట సోషల్ మీడియాలో ఒక సెన్సెషన్.. ఇప్పటికీ ఆ పాట జోరు తగ్గలేదు. ఏ వేడుకకు వెళ్లినా... ఈ పాట ఉండాల్సిందే. ఈ పాట లేకుండా ఆ పంక్షన్ పూర్తి కాదు. ఓ నూతన జంట పెళ్లి భరత్ లో డ్యాన్స్ చేయడంలో ఈ పాట.. వైరల్ గా మారింది. ఇప్పుడు జగిత్యాల జిల్లా కేంద్రంలో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. జగిత్యాల మినీ స్టేడియంలో ఒకేసారి 1000 మంది చిన్నారులు, మహిళలు, యువతులతో బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా పాటకు డ్యాన్స్ చేశారు.
కళాకారుడు మచ్చురవి వేయ్యి మందితో డ్యాన్య్ చేయించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ రవి హాజరయ్యారు. బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసేందుకు.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని వారు సైతం ఇక్కడకు వచ్చారు. నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. అంతేకాదు.. పెళ్లి భరత్ లో డ్యాన్స్ చేసి వైరల్ అయిన సాయి శ్రీ సైతం పాల్గొన్నారు. ఈ పాట ప్రపంచ రికార్డ్ సాధించడం ఆనందంగ ఉందని చెప్పారు.
బుల్లెట్ బండి పాటను లక్ష్మణ్ రాయగా ఎస్‌కే బాజి మ్యూజిక్ ఇచ్చారు. మోహన భోగరాజు పాటను ఆలపించారు. గతేడాది ఏప్రిల్ 7న బుల్లెట్ బండి ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ చేశారు. దీనికోసం.. మోహన పాట పాడడమే కాదు.. నృత్యం కూడా చేశారు. ఒరిజినల్ వీడియో కంటే.. పెళ్లిలో సాయి శ్రీ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. అప్పటి నుంచి ఈ పాటకు క్రేజ్ ఎక్కువగా వచ్చింది.