Telangana Caste Census : మీరు 'కుల గణన' సర్వేలో పాల్గొనలేదా..? అయితే వెంటనే ఇలా చేయండి-those who have not participated in the cast census survey can give information through online ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Caste Census : మీరు 'కుల గణన' సర్వేలో పాల్గొనలేదా..? అయితే వెంటనే ఇలా చేయండి

Telangana Caste Census : మీరు 'కుల గణన' సర్వేలో పాల్గొనలేదా..? అయితే వెంటనే ఇలా చేయండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Feb 18, 2025 07:23 AM IST

రాష్ట్రంలో కుల గణన సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో నిర్వహించిన సర్వేలో పాల్గొనని వారు… ఈ సర్వే ద్వారా వివరాలను ఇవ్వొచ్చు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు అవకాశం ఉంది. ఫోన్ ద్వారా లేదా ఆన్ లైన్ ద్వారా సమాచారం ఇచ్చి వివరాలు నమోదు చేసుకోవచ్చు.

తెలంగాణలో కుల గణన
తెలంగాణలో కుల గణన

కులగణన వివరాల నమోదుకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి వివరాలను సేకరిస్తోంది. ఫిబ్రవరి 28వ తేదీతో ఈ గడువు ముగియనుంది. అయితే మిగిలిపోయిన వారికోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలా కాకుండా ఆన్ లైన్ లో కూడా సమాచారం ఇచ్చే అవకాశం కల్పించింది.

ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. కుల సర్వే లో పాల్గొనని వారు సమాచారం ఇవ్వని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని… తెలంగాణ జనాభా లెక్కల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లకు రాజకీయ విద్య ఉద్యోగ అవకాశాల్లో చట్ట బద్దత చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కులగణనలో పాల్గొనని వారు ఈనెల 28 వరకు నమోదు చేసుకోవచ్చు. దీని కోసం టోల్ ఫ్రీ నం. 040-211 11111ను ఏర్పాటు చేయడం జరిగిందని పొన్నం తెలిపారు.

మీ వివరాలు ఇలా ఇవ్వొచ్చు…

  • కుల గణన సర్వేలో పాల్గొనలేదని ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి ఎన్యుమరేటర్లు వెళ్తారు. వివరాలు నమోదు చేస్తారు,
  • ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చు.
  • ఆన్లైన్ లో నమోదు చేసుకునే వారు https://seeepsurvey.cgg.gov.in ద్వారా తమ సమాచారాన్ని ఇవ్వొచ్చు.
  • కులగణన సర్వేలో 3,56,323 కుటుంబాలు పాల్గొనలేదని ప్రభుత్వం గుర్తించింది. వీరి వివరాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఈస సర్వే అవకాశాన్ని కల్పించింది.
  • తప్పనిసరిగా ఈ సర్వే లో పాల్గొని తెలంగాణ జనాభా లెక్కల్లో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
  • ఎక్కడెక్కడ కుల సర్వే లో పాల్గొనలేదో అక్కడ కుల సంఘాల నేతలు ,మేధావులు ఫ్రొఫెసర్లు వారికి అవగాహన కల్పించాలని సర్కార్ కోరుతోంది. వారిని భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం