కులగణన వివరాల నమోదుకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి వివరాలను సేకరిస్తోంది. ఫిబ్రవరి 28వ తేదీతో ఈ గడువు ముగియనుంది. అయితే మిగిలిపోయిన వారికోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలా కాకుండా ఆన్ లైన్ లో కూడా సమాచారం ఇచ్చే అవకాశం కల్పించింది.
ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. కుల సర్వే లో పాల్గొనని వారు సమాచారం ఇవ్వని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని… తెలంగాణ జనాభా లెక్కల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లకు రాజకీయ విద్య ఉద్యోగ అవకాశాల్లో చట్ట బద్దత చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కులగణనలో పాల్గొనని వారు ఈనెల 28 వరకు నమోదు చేసుకోవచ్చు. దీని కోసం టోల్ ఫ్రీ నం. 040-211 11111ను ఏర్పాటు చేయడం జరిగిందని పొన్నం తెలిపారు.
సంబంధిత కథనం