TG Raithu Bharosa: తెలంగాణలో మూడో విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. తెలంగాణలో కొద్ది రోజులకు రైతులకు రైతు భరోసా జమ చేస్తున్నారు. మూడో విడతలో రెండు ఎకరాల వరకు వ్యవసాయయోగ్యమైన భూమి ఉన్న రైతులకు సోమవారం నిధులను విడుదల చేసినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది.
తెలంగాణలో రైతులకు మూడో విడత రైతు భరోసా నిధులను జమ చేశారు. జనవరి 27న 577 గ్రామాలకు పైలట్ ప్రాతిపదికన రైతు భరోసా జమ చేశారు. మొత్తం 4,41, 911మంది రైతులకు రూ.5,68,99,97,265 జమ చేశారు.మొదటి విడతలో 9,48,332.35 ఎకరాలకు రైతు భరోసా చెల్లించారు.
ఫిబ్రవరి 5వ తేదీన రెండో విడతలో 17,03,419మంది రైతులకు చెందిన 9,29,234.20 ఎకరాలకు రైతు భరోసా చెల్లించారు. ఎకరంలోపు పొలం ఉన్నవారికి రూ.5,57,54,07,019 కోట్లను చెల్లించారు.
మూడో విడతలో సోమవారం రెండు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా చెల్లించారు. మొత్తం 13, 23, 615మంది రైతులకు చెందిన 18, 19, 919.24 ఎకరాలకు రూ. 10,91, 95,15,390 కోట్లను రైతులకు ఖాతాలకు జమ చేశారు.
మూడు విడతల్లో కలిపి 34.69లక్షల మంది రైతులకు రైతు భరోసా చెల్లించారు. 36.97లక్షల ఎకరాలకు రైతు భరోసా అందించారు. రైతు భరోసా రూపంలో రూ.2218.49 కోట్లను చెల్లించారు.