TG IPS Promotions: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌లకు డీజీలుగా పదోన్నతి కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం
TG IPS Promotions: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పించారు. ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
TG IPS Promotions: తెలంగాణ 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి దక్కిన వారిలో అభిలాష బిష్త్ పదోన్నతికి సంబంధించి డిఓపిటి అనుమతి రావాల్సి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ క్యాడర్ కేటాయింపు ఖరారుపై డిఓపిటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
డీజీలుగా పదోన్నతి పొందన వారిలో 1994 బ్యాచ్‌కు చెందిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి, ఇంటెలిజెన్స్ బాధ్యతలు చూస్తున్న బి.శివధర్ రెడ్డి, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష భిస్త్, ( అభిలాష బిస్త్‌ను డీజీపీ ట్రైనింగ్ పోస్ట్‌లో కొనసాగిస్తారు),జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ,సిఐడి చీఫ్ శిఖా గోయల్ ఉన్నారు.
హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డితోపాటు అభిలాష బిస్త్, సౌమ్య మిశ్రా, షికా గోయల్‌ను డీజీపీలుగా ప్రమోట్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, సీఐడీ చీఫ్ షికా గోయల్ పనిచేస్తున్నారు. వారు అవే స్థానాల్లో కొనసాగుతారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.