TG School Holiday Updates : విద్యార్థులకు బ్యాడ్‌న్యూస్ - ఈ నెలలో రెండో శనివారం హాలీ డే రద్దు, ఎందుకంటే..!
తెలంగాణలోని మూడు జిల్లాల్లోని విద్యా సంస్థలకు కీలక అప్డేట్ వచ్చింది. ఈ నవంబర్ 9వ తేదీన(రెండో శనివారం) ఇచ్చే హాలీ డే డేను రద్దైంది. సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో యథావిధిగా విద్యా సంస్థలు పని చేయనున్నాయి. మిగతా జిల్లాల్లో మాత్రం సెలవు ఉండనుంది.
తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ జిల్లాలోని విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నవంబర్ లో వచ్చే రెండో శనివారం హాలీ డే(నవంబర్ 9) రద్దు చేస్తున్నట్లు తెలిపింది. యథావిధిగా విద్యా సంస్థలు పని చేస్తాయని పేర్కొంది.
నవంబర్ 9వ తేదీన సెలవు రద్దు అంశంపై తెలంగాణ సర్కార్.. సెప్టెంబర్ మాసంలోనే ప్రకటన చేసింది. సెప్టెంబర్ 17న వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు సెలవునిచ్చింది. మిగతా జిల్లాల్లో మాత్రమే విద్యా సంస్థలు పని చేశాయి. సెప్టెంబర్ 17వ తేదీన సెలవు ఇచ్చిన సందర్భంగా… నవంబర్ 9వ తేదీని వర్కింగ్ డే గా ప్రకటించారు . ఈ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఈ నవంబర్ 9వ తేదీన విద్యా సంస్థలు తెరిచి ఉండనున్నాయి.
ఇక డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నారు. కొన్ని స్కూళ్లకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుంది. మిగతా స్కూళ్లు తెరిచి ఉంటాయి. ఇక వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు వస్తాయి.
2025, ఫిబ్రవరి 28లోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ లో తెలిపిన సంగతి తెలిసిందే.
ఏపీలో సెలవులు ఇలా…
మరోవైపు ఏపీలో మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 22 నుంచి 29 వరకు ఇవ్వనున్నారు. సంకాంత్రి సెలవులు 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి. మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు సెలవులు ఇవ్వనున్నారు.
ఇక ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 28 నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 11వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
నిర్ణయించిన తేదీలలోపు కట్టకపోతే… ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుంది.నవంబర్ 12వ తేదీ నుంచి నవంబరు 18వ తేదీల్లో చెల్లిస్తే… రూ.50 అదనంగా కట్టాలి. ఇక నవంబర్ 19 నుంచి 25వ తేదీల్లో చెల్లిస్తే… రూ.200 అదనపు రుసుం చెల్లించాలి. నవంబర్ 26 నుంచి నవంబరు 30 వరకు రూ.500 ఆలస్య రుసుము చెల్లించాలి.
ఈ ఫీజును ఆన్ లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది. పాఠశాల లాగిన్ ద్వారా ప్రధానోపాధ్యాయులూ కూడా చెల్లించవచ్చు.
- ఫీజు చెల్లింపునకు తుది గడువు - 11 నవంబర్ 2024.
- ఆలస్య రుసుంతో నవంబర్ 12 - 18 - రూ. 50 అదనంగా చెల్లించాలి.
- నవంబర్ 19 నుంచి 25 - రూ.200 అదనపు రుసుం చెల్లించాలి.
- నవంబర్ 26 నుంచి నవంబరు 30 వరకు - రూ.500 ఆలస్య రుసుము చెల్లించాలి.
- అధికారిక వెబ్ సైట్ - https://bse.ap.gov.in/