Charlapalli railway station : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం రేపే.. ఈ రైళ్ల రాకపోకల్లో మార్పులు!-the new satellite terminal at cherlapally railway station is set to open on november 29 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Charlapalli Railway Station : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం రేపే.. ఈ రైళ్ల రాకపోకల్లో మార్పులు!

Charlapalli railway station : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం రేపే.. ఈ రైళ్ల రాకపోకల్లో మార్పులు!

Basani Shiva Kumar HT Telugu
Nov 29, 2024 01:57 PM IST

Charlapalli railway station : చర్లపల్లి రైల్వే స్టేషన్‌లోని కొత్త శాటిలైట్ టెర్మినల్ రేపు ప్రారంభం కానుంది. రైల్వే శాఖమంత్రి దీన్ని ప్రారంభించనున్నారు. ఈ స్టేషన్ తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతోందని అధికారులు చెబుతున్నారు.

చర్లపల్లి రైల్వే టెర్మినల్
చర్లపల్లి రైల్వే టెర్మినల్ (@kishanreddybjp)

అత్యాధునిక హంగులు, సకల వనతులు, రూ.428 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌‌ను రేపు (నవబంర్ 30)న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించనున్నారు. దీంతో రేపటి నుంచే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ రైల్వేస్టేషన్‌ మీదుగా ఇప్పటికే నడున్తున్న ర్లెళ్లకు తోడు.. మరో 25 జతల రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. వాస్తవానికి ప్రధాని మోదీ దీన్ని ప్రారంభిస్తారని మొదట్లో చెప్పారు. కానీ.. ఇప్పుడు రైల్వే మంత్రి ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు.

ఈ కొత్త టెర్మినల్ ఓపెన్ అయ్యాక హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం రూ. 428 కోట్లతో ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేశారు. ఐదు లిఫ్టులు, ఐదు ఎస్కులేటర్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 10 కొత్త లైన్లు ఏర్పాటు చేశారు.

ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా భవనం, సౌందర్య వంతమైన ముఖ్య ద్వారం నిర్మించారు. ఈ స్టేషన్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఆరు టికెట్ బుకింగ్ కౌంటర్లు, లేడీస్ వెయిటింగ్ హాల్, పురుషుల వెయిటింగ్ హాల్, ఎగువ తరగతి వెయిటింగ్ హాల్, ఎగ్జిక్యూటివ్ లాంజ్, మొదటి అంతస్తులో కేఫ్టేరియా, రెస్టారెంట్, స్త్రీలు, పురుషుల కోసం విశ్రాంతి గదులు ఉంటాయి. స్టేషన్ ముఖద్వారానికి అత్యాధునిక లైటింగ్వ్యవస్థ ఏర్పాటు చేశారు.

చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైన నేపథ్యంలో.. రైల్వే బోర్డు పలు అనుమతులు ఇచ్చింది. చర్లపల్లి స్టేషన్ నుంచి 6 ఎక్స్ ప్రెస్ రైళ్లును నడిపేందుకు అనుమతి వచ్చింది. మరో 12 రైళ్లు ఈ స్టేషన్‌లో ఆపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీన్ని ప్రారంభించిన తర్వాత ఇక్కడి నుంచి రైళ్లను నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సిద్ధం అవుతున్నారు.

ఆ రైళ్లు ఇవే..

షాలిమార్‌ - హైదరాబాద్‌ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్ - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌

గోరఖ్‌పూర్‌ - సికింద్రాబాద్‌ - గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్

ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్ - షాలిమార్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌‌లు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్నాయి.

ఈ రైళ్లకు హాల్టింగ్..

విజయవాడ - సికింద్రాబాద్‌ - విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌

గుంటూరు - సికింద్రాబాద్‌ - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ - సికింద్రాబాద్ భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌

గుంటూరు - సికింద్రాబాద్‌ - గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌‌లకు చర్లపల్లి హాల్టింగ్ ఇచ్చారు.

Whats_app_banner