Hyd Boy Murder Mystery: వీడిన దుర్గానగర్ బాలుడి మర్డర్ మిస్టరీ.. వృద్ధుడి వికృత చర్యలే కారణం..
Hyd Boy Murder Mystery: దుర్గా నగర్‌లో పదేళ్ల బాలుడి మృతి వెనుక మిస్టరీని పోలీసులు చేధించారు. వృద్ధుడి కామోన్మాదానికి బాలుడు బాలయ్యాడు.
Hyd Boy Murder Mystery: హైదరాబాద్ దుర్గా నగర్ ప్రాంతంలో జరిగిన బాలుడి హత్య కేసును పోలీసులు చేధించారు. స్థానికుల అనుమానమే నిజమైంది. బాలుడు మాయం కావడానికి కొద్ది రోజుల ముందు ఆ ప్రాంతానికి వచ్చిన వృద్ధుడిపై స్థానికులు వ్యక్తం చేసిన అనుమానాలే నిందితుడిని పట్టించాయి.
బాలుడు మాయమైన సమయంలో ఆ ప్రాంతంలో ఉండే వృద్ధుడి మీద స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే వృద్ధుడితో కలిసి బాలుడు వెళ్లడం సీసీటీవీల్లో కూడా రికార్డ్ అయ్యింది. బాలుడి అంత్యక్రియలు పూర్తైన తర్వాత నిందితు ఆ ప్రాంతానికి తిరిగి వచ్చినట్టు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడించిన తర్వాత కేసు చిక్కు ముడి వీడిపోయింది. బాలుడిని తానే చంపినట్టు వృద్ధుడు అంగీకరించడంతో అవాక్కయ్యారు. బాలుడిపై అత్యాచారం చేసి ఎదురు తిరగడంతో చంపేసినట్టు వెల్డించాడు.
జూబ్లీహిల్స్‌లో దుర్గానగర్‌లో గత బుధవారం సంపులో శవమై కనిపించిన బాలుడి కేసును పోలీసులు చేధించారు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బాలుడి వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. రోడ్ 5లోని దుర్గాభవానీనగర్ బస్తీలో ఉంటున్న ముదావత్ రమేష్, కవితల రెండో కుమారుడు కార్తిక్ అలియాస్ పండు(10) గత మంగళవారం రాత్రి ఆడుకోవడానికి వెళ్లి అదృశ్యం అయ్యాడు. స్థానికుల గాలింపులో బుధవారం ఉదయం పార్కు లోపల ఉన్న డ్రైనేజీలో మృతి చెంది కనిపించాడు. బాలుడిని ఎవరో చంపేశారని తల్లి ఆరోపించింది.
ఇదే బస్తీకి చెందిన మన్యం నాయక్(42) కొంతకాలంగా కనిపించకుండా పోయాడు. 15 రోజుల క్రితమే బస్తీకి బాలుడితో పరిచయం చేసుకున్నాడు. గతంలో బాలుడి కుటుంబంతో గొడవలు కూాడా ఉన్నట్లు గుర్తించారు.
బాలుడు చనిపోయినప్పటి నుంచి నాయక్ ఫోన్‌లో కూడా అందుబాటులో లేకపోవడంతో అనుమానించారు. బాలుడి అంత్యక్రియలు ముగిసిన తర్వాత గుట్ట మీదకు వచ్చినట్టు గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మద్యం మత్తులో ఉన్న నిందితుడు గత మంగళవారం రాత్రి పార్కులో ఆడుకుంటున్న బాలుడిని తనతో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. అతనికి బాలుడు ఎదురు తిరగడంతో గొంతు నులిమి తలపై రాయితో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని డ్రైనేజీలోకి తోసేసినట్లు వివరించాడు. నిందితుడు కుమారుడి ద్వారా పోలీసులు నేరం జరిగిన తీరును రాబట్టారు. బాలలపై అత్యాచారాలు చేసినట్టు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి భార్య చనిపోయిన తర్వాత ఇంటికి రావడం లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఏటిఎంలో నగదు దోచేశారు….
మహబూబాబాద్ జిల్లా బయ్యారం పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉన్నఎస్‌బీఐ ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు భారీ చోరీ చేశారు. మండల కేంద్రంలోని రామాలయం కూడలిలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంను పగులగొట్టి రూ.29.70లక్షలు అపహరించారు.
శనివారం రాత్రి నల్ల రంగు కారులో వచ్చిన దుండగులు రామాలయం చుట్టూ పక్కల ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు సీసీ పుటేజీలో రికార్డు అయింది. సీసీ కెమెరాలకు నల్ల రంగు స్ప్రే చేసి ఇద్దరు ఏటిఎంలో ప్రవేశించారు.
గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం తలుపును తెరచి అందులో ఉన్న రూ.29.70లక్షల నగదును అపహరించారు. ఆదివారం ఉదయం నగదు తీసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి ధ్వంసమైన ఏటీఎంను చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి వచ్చిన పోలీసులు ఆధారాలు సేకరించారు.
మేడారం జాతర నేపథ్యంలో నిఘా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దుండగులు చోరీలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చోరీ జరిగిన తీరు ఆధారంగా నిందితుల్ని గుర్తించినట్టు చెబుతున్నారు.