IAS Arvind Issue: ఈ కార్‌ రేసింగ్.. డబ్బు చెల్లింపులో తప్పు చేయలేదంటున్న ఐఏఎస్-the ias officer says no wrongdoing in paying money for formula e car racing ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ias Arvind Issue: ఈ కార్‌ రేసింగ్.. డబ్బు చెల్లింపులో తప్పు చేయలేదంటున్న ఐఏఎస్

IAS Arvind Issue: ఈ కార్‌ రేసింగ్.. డబ్బు చెల్లింపులో తప్పు చేయలేదంటున్న ఐఏఎస్

Sarath chandra.B HT Telugu
Jan 19, 2024 10:10 AM IST

IAS Aravind Issue: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఫార్ములా ఈ కార్‌ రేసింగ్ సంస్థకు డబ్బు చెల్లించడంలో తన ప్రమేయం లేదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు చెల్లింపులు జరిపినట్టు ఐఏఎస్ అర్వింద్ వివరణ ఇచ్చారు.

రేసింగ్‌ల నిర్వహణపై ఐఏఎస్ అర్వింద్ వివరణ
రేసింగ్‌ల నిర్వహణపై ఐఏఎస్ అర్వింద్ వివరణ (twitter)

IAS Aravind Issue: ఫార్ములా-ఇ కార్‌ రేసింగ్‌ చెల్లింపుల వ్యవహారంలో తన తప్పు లేదని సీనియర్ ఐఏఎస్‌ అధికారి వివరణ ఇచ్చారు. ఈ కార్‌ రేసింగ్‌ సంస్థతో ఒప్పందంపై ఖజానాకు నష్టం వాటిల్లడంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ ఈ నెల 13న వివరణ ఇచ్చారు.

రేసింగ్ సంస్థకు చెల్లింపుల విషయంలో నిబంధనల మేరకే తాను వ్యవహరించానని, ప్రభుత్వ ఆదేశాలనుఅమలు చేసినట్లు అర్వింద్ కుమార్‌ వివరణ ఇచ్చారు. ఫార్ములా-ఇ కార్‌ రేసింగ్‌కు సంబంధించిన ఒప్పందాల ప్రక్రియ అంతా సజావుగానే జరిగిందని, దానికి అనుగుణంగా రూ.55 కోట్ల చెల్లింపులు జరిగాయని వివరణలో పేర్కొన్నారు.

ఫార్ములా-ఇ రేస్‌కు సంబంధించిన తొమ్మిది అంశాలపై వివరణ కోరుతూ ఈ నెల ఆరో తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. అర్వింద్‌ కుమార్‌కు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. ఒక్కో అంశంపై అర్వింద్‌కుమార్‌ సమగ్రంగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఏమి జరిగిందంటే…

ప్రభుత్వ అనుమతులు లేకుండానే తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో నిబధంనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేసిన వ్యవహారంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. క్యాబినెట్ అనుమతి, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా రూ.54కోట్ల విడుదల చేశారనే అభియోగాలపై వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది.

హెచ్‌ఎండిఏ కమిషనర్‌గా వ్యవహరించిన అరవింద్‌ కుమార్‌ నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల చేసి ఉల్లంఘనలకు పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత 2023 అక్టోబర్‌30వ తేదీన ఎన్నికల కమిషన్‌ అనుమతి లేకుండానే ఈ రేసింగ్‌ ప్రాజెక్టుకు నిధుల్ని విడుదల చేశారు. కొత్త ప్రాజెక్టులకు నిధుల విడుదల చేయడంపై ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సి ఉన్నా క్యాబినెట్‌ అమోదం లేకుండా, ఆర్థికశాఖ అనుమతులు లేకుండానే హైదరాబాద్‌లో పార్ములా-ఈ రేస్ పోటీలను నిర్వహించేందుకు హెచ్ఎండీఏ ఒప్పందం కుదుర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.

పోటీల నిర్వహణ కోసం రూ. 54 కోట్లు ముందస్తుగా చెల్లించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుం డా ఒప్పందాన్ని అతిక్రమించి రేస్ రద్దు చేసినందుకు మున్సిపల్ శాఖకు లీగల్ నోటీసులు ఇస్తామంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ (ఎస్ఐఏ) ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టిసారించింది. ఈ క్రమంలో నిధుల విడుదల అంశం వెలుగులోకి వచ్చింది.

నిబంధనల మార్చేసి….

కార్‌ రేసింగ్‌ నిర్వహణపై ఒప్పందం, నిధుల విడుదల విషయంలో నిబంధ నలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్‌కు చీఫ్‌ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ పోటీల నిర్వహణపై ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకున్నారని సిఎస్‌ ఉత్తర్వులో పేర్కొన్నారు. హెచ్‌ఎండిఏ నుంచి బిల్లుల రూపంలో రూ.46కోట్లు పన్నుల రూపంలో మరో 9 కోట్లను చెల్లించడానికి కారణాలు ఏమిటన్నది తెలపాలని సిఎస్‌ ఆదేశించారు.

2023లో పోటీల నిర్వహణ…

గత ఏడాది ఫిబ్రవరి-11న హైదరాబాద్లో జరిగిన సీజన్-9 పార్ములా-ఈ రేస్ నిర్వహణకు రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో ఈవెంట్ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌కో రూ.150కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30కోట్లు ఖర్చుచేశాయి.

sa రహదారులు, ఇతర మౌలిక వసతులకు హెచ్ఎండీఏ రూ.20 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది తలపెట్టిన ఫార్ములా-ఈ 10వ సీజన్ ఈవెంట్కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌గా ఉండాల్సి ఉంది. ఖర్చు మొత్తం ప్రైవేటు సంస్థలైన గ్రీన్‌ కో ఫార్ములా ఈ సంస్థ భరించాల్సి ఉంది.

Whats_app_banner