Fire Accident: భార్యను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన భర్త-the husband lost his life trying to save his wife caught in the fire ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Fire Accident: భార్యను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన భర్త

Fire Accident: భార్యను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన భర్త

HT Telugu Desk HT Telugu
Nov 13, 2023 07:27 AM IST

Fire Accident: పండుగ వేళ హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దీపాలు పెడుతుండగా మంటల్లో చిక్కకున్న వృద్ధురాలిని రక్షించే ప్రయత్నంలో భర్త ప్రాణాలు కోల్పోయాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది.

మల్కాజ్‌గిరిలో ఘోర ప్రమాదం
మల్కాజ్‌గిరిలో ఘోర ప్రమాదం (twitter)

Fire Accident: దీపావళి పండుగ వేళ హైదరాబాద్ మల్కాజ్ గిరి లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మల్కాజిగిరి పీవిఎన్ నగర్ వెంకటేశ్వర అపార్ట్మెంట్‌లో ఉంటున్న వృద్ధ దంపతులు రాఘవరావు (82), రఘవమ్మ (79) మంటల్లో చిక్కుకున్నారు.

దీపావళి సందర్బంగా రాఘవమ్మ ఆదివారం సాయంత్రం దీపాలు వెలిగిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పు అంటుకుంది. భార్య మంటల్లో చిక్కుకోవడాన్ని గమనించిన భర్త ఆమెను కాపాడే ప్రయత్నంలో మంటలు అంటుకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

రాఘవమ్మకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. వృద్ధ దంపతులు మంటల్లోచిక్కుకోవడాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. 80శాతం గాయాలతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మల్కాజిగిరి లో దారుణ హత్య…

మల్కాజ్‌గిరి నెరెడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. స్రవంతి(22), మహేందర్ దంపతులు గత కొంత కాలంగా సమత నగర్ లో నివాసం ఉంటున్నారు.ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య ఆదివారం గొడవ జరిగింది.

ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంలో క్షణికావేశంలో మహేందర్ భార్య స్రవంతి ని హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలసులు క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.నిందితుడు మహేందర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

(రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్)

WhatsApp channel