TS Assembly Election Nov30: తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్
TS Assembly Election Nov30: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ రాజీవ్‌కుమార్ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో చివరగా తెలంగాణలో పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగనుంది.
TS Assembly Election Nov30: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చివరగా తెలంగాణలో పోలింగ్ జరుగనుంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది
తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరుగనున్నాయి.నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13 వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు అనుమతిస్తారు. పోలింగ్ నవంబర్ 30న నిర్వహిస్తారు. కౌంటింగ్ డిసెంబర్ 3న జరుగుతుంది. డిసెంబర్ 5లోగా ఎన్నికలు ముగిస్తారు. తెలంగాణలో 3.15కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు సీఈసీ ప్రకటించారు. వారిలో పురుషులు 1.58కోట్లు, మహిళలు 1.58కోట్లుగా ఉన్నారు. తెలంగాణలో 18ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు 8.11లక్షల మంది ఓటు హక్కును నమోదు చేసుకున్నట్లు వివరించారు.
మిజోరాం తొలి పోలింగ్…
మిజోరాంలో నవంబర్ 7న ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 13న నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబర్ 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21వరకు పరిశీలిస్తారు. 23వరకు నామినేషన్ల ఉపసంహరణకు అనుమతిస్తారు. పోలింగ్ నవంబర్ 7న నిర్వహిస్తారు. కౌంటింగ్ డిసెంబర్ 3న జరుగుతంది. మిజోరాంలో 8.52లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు.
చత్తీస్‌గడ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 7,17తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. మొదటి దశలో 20 నియోజక వర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. రెండో దశలో 70 చోట్ల ఎన్నికలు నిర్వహిస్తారు. కౌంటింగ్ డిసెంబర్ 3న నిర్వహిస్తారు. చత్తీస్ ఘడ్‌లో 2.03కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 21న నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబర్ 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31వరకు పరిశీలిస్తారు. నవంబర్ 2వరకు నామినేషన్ల ఉపసంహరణకు అనుమతిస్తారు. పోలింగ్ నవంబర్ 17న నిర్వహిస్తారు. కౌంటింగ్ డిసెంబర్ 3న జరుగుతంది. మధ్యప్రదేశ్‌లో 5.6కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
రాజస్థాన్‌లో నవంబర్ 23న ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 30న నోటిఫికేషన్ వెలువడనుంది.నవంబర్ 6 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 7వరకు పరిశీలిస్తారు. 9వరకు నామినేషన్ల ఉపసంహరణకు అనుమతిస్తారు. పోలింగ్ నవంబర్ 23న నిర్వహిస్తారు. కౌంటింగ్ డిసెంబర్ 3న జరుగుతంది. డిసెంబర్ 5లోగా ఎన్నికలు ముగిస్తారు. రాజస్థాన్‌లో 5.25కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నామని ప్రకటించిన సీఈసీ
ఎన్నికల ప్రక్రియలో భాగమైన అన్ని ప్రభుత్వ విభాగాలతో ఇప్పటికే సన్నద్ధం చేసినట్లు ఛీప్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. ఇప్పటికే రాజకీయ పార్టీలతో చర్చలు జరిపినట్టు చెప్పారు. గత ఆర్నెల్లుగా ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్నట్లు వివరించారు.
ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగునున్నట్టు చెప్పారు. దేశంలోని మొత్తం ఓటర్లు ఐదు రాష్ట్రాల్లో ఆరో వంతు ఎన్నికల ప్రక్రియలో భాగం కానున్నట్టు చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి 8.2 పురుష ఓటర్లు, 7.8మహిళలు ఉన్నారన్నారు. 16.19కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టు సీఈసీ చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి సారి ఓటు వేసే వారు 60.2లక్షల మంది ఉన్నారని చెప్పారు. 17.34 వికలాంగ ఓటర్లు ఐదు రాష్ట్రాల్లో ఉన్నారని, 24.70లక్షల మంది 80 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారని చెప్పారు. వారికి ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు.
అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలు ఇప్పటికే సిద్ధం అయ్యాయని సీఈసీ స్పష్టం చేశారు. రోల్ టూ పోల్‌కు సర్వసన్నద్ధం అయినట్టు చెప్పారు.అన్ని రాష్ట్రాల్లో 100శాతం ఎన్‌రోల్‌మెంట్ పూర్తైనట్టు చెప్పారు.జనవరి 1నాటికి 18ఏళ్లు నిండిన ఐదు రాష్ట్రాల్లో 60లక్షల మందికి కొత్తగా ఓటు హక్కు వచ్చిందని వివరించారు. అన్ని రాష్ట్రాల్లో వివిప్యాట్ విధానంలో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.