TG Govt GO 317 : ఉద్యోగుల దరఖాస్తులపై జీఏడీకి ఆదేశాలు - జీవో 317పై కేబినేట్‌ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు-the cabinet sub committee constituted on go 317 took several decisions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Go 317 : ఉద్యోగుల దరఖాస్తులపై జీఏడీకి ఆదేశాలు - జీవో 317పై కేబినేట్‌ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు

TG Govt GO 317 : ఉద్యోగుల దరఖాస్తులపై జీఏడీకి ఆదేశాలు - జీవో 317పై కేబినేట్‌ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు

Telangana Govt GO 317 : జీవో 317 పై ఏర్పాటైన కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశమైంది. పలు కీలక అంశాలపై నిర్ణయాలను ప్రకటించింది.

మంత్రుల సబ్ కమిటీ భేటీ

జీవో 317 పై ఏర్పాటైన కేబినెట్‌ సబ్ కమిటీ గురువారం సమావేశమైంది. ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది.

క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ సబ్ కమిటీకి చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాకాధిపతులకు పంపించాల్సిందిగా జీఏడీ అధికారులకు సబ్ కమిటీ ఆదేశించింది.

మిగతా దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి వాటిని పరిశీలన చేసిన అనంతరం తిరిగి క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని కమిటీ నిర్ణయించింది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు, శివశంకర్ (రిటైర్డ్ IAS)తో పాటు జీఏడీ అధికారులు పాల్గొన్నారు.