Arunachalam : అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఈ జిల్లాల నుంచి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు-tgsrtc special buses to arunachalam giri pradakshina covering kanipakam golden temple ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Arunachalam : అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఈ జిల్లాల నుంచి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Arunachalam : అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఈ జిల్లాల నుంచి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Bandaru Satyaprasad HT Telugu
Nov 06, 2024 05:13 PM IST

Arunachalam Giri Pradakshina : కార్తీక పౌర్ణమికి అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్ మీుదుగా అరుణాచలం ప్రత్యేకే ప్యాకేజీ అందిస్తుంది. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఈ జిల్లాల నుంచి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఈ జిల్లాల నుంచి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

కార్తీక పౌర్ణమి సంద‌ర్భంగా అరుణాచ‌లేశ్వరుని గిరి ప్రదక్షిణ‌కు వెళ్లే భ‌క్తుల‌కు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పరమేశ్వరుడి ద‌ర్శనం కోసం అరుణాచ‌లం గిరి ప్రద‌క్షిణ టూర్ ప్యాకేజీని టీజీఎస్ఆర్టీసీ ప్రక‌టించింది. ఈ ప్యాకేజీలో కాణిపాకం వ‌ర‌సిద్ధి వినాయ‌క‌స్వామి దర్శనంతో పాటు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించే సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తోంది.

తెలంగాణ‌లోని హైద‌రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెద‌క్, న‌ల్లగొండ‌, వరంగ‌ల్, క‌రీంన‌గ‌ర్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి అరుణాచ‌లానికి ప్రత్యేక బ‌స్సుల‌ను నడుపుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి కాగా, 13 నుంచి ఆయా జిల్లాల నుంచి ప్రత్యేక బ‌స్సులు అరుణాచలానికి బ‌య‌లుదేరతాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ ద‌ర్శనం త‌ర్వాత కార్తీక పౌర్ణమి పర్వదినం నాటికి అరుణాచ‌లానికి చేరుకుంటాయి. అరుణాచ‌ల గిరి ప్రదక్షిణ ప్యాకేజీని http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవ‌చ్చని సజ్జనార్ సూచించారు. ప్రయాణికులు పూర్తి వివ‌రాల‌కు కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-23450033, 040-69440000 సంప్రదించ‌వచ్చు.

కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాల‌కు దర్శనానికి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. శ్రీశైలం, వేముల‌వాడ, ధర్మపురి, కీస‌ర‌గుట్ట, ఇతర శైవ క్షేత్రాలకు హైద‌రాబాద్ నుంచి ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌న్నారు. ఆర్టీసీకి కార్తీక మాసం, శ‌బ‌రిమ‌ల ప్యాకేజీలు ఎంతో కీల‌క‌మ‌న్నారు. ఆది, సోమ‌వారాలు శైవ‌క్షేత్రాల‌కు భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఆ మేరకు ప్రత్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌ అందుబాటులో ఉంటుందన్నారు.

తెలంగాణ టూరిజం అరుణాచలం ప్యాకేజీ

పౌర్ణమి రోజున అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యఫలమని భక్తులు నమ్మకం. నవంబర్ 15న పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుడిని దర్శించుకునేవారికి తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ - అరుణాచలం పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్​ నుంచి రోడ్డు మార్గంలో అరుణాచలం టూర్​సాగనుంది. 3 రాత్రులు, 4 పగళ్ల పాటు టూర్ కొనసాగనుంది. అరుణాచలేశ్వర ఆలయంతోపాటు కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్ కవర్ చేస్తుంది. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ నవంబర్ నెలలో 13వ తేదీన టూర్ స్టార్ట్ అవుతుంది.

  1. మొదటి రోజు సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్​లోని బషీర్ బాగ్ నుంచి తెలంగాణ టూరిజం బస్సు బయలుదేరుతుంది.
  2. రెండో రోజు ఉదయం 6 గంటలకు యాత్రికులు కాణిపాకం చేరుకుంటారు. ఉదయం 9 గంటల లోపు కాణిపాకం ఆలయ దర్శనం ముగించుకుంటారు. అక్కడి నుంచి అరుణాచలం బయలుదేరుతారు. మధ్యాహ్నం 1 గంటకు అరుణాచలం చేరుకుంటారు. అక్కడి హోటల్ లో చెక్ ఇన్ అవుతారు. అనంతరం అరుణాచలేశ్వరస్వామి దర్శించుకుంటారు. ఆ రోజు రాత్రికి అరుణాచలంలోనే బస చేస్తారు.
  3. మూడో రోజు బ్రేక్​ఫాస్ట్ తర్వాత బస్సు బయలుదేరుతుంది. మధ్యాహ్నానికి వెల్లూరు శ్రీపురం గోల్డెన్ టెంపుల్​ను దర్శించుకుంటారు. దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం స్టార్ట్​ అవుతుంది.
  4. నాలుగో రోజు ఉదయానికి హైదరాబాద్​చేరుకుంటారు.

Whats_app_banner

సంబంధిత కథనం