TGSRTC Offer : బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, ఒక్కొక్కరికీ రూ.100 నుంచి రూ.160 ఆదా
TGSRTC Offer : తెలంగాణ నుంచి బెంగళూరుకు ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు రూట్ లో నడిచే అన్ని సర్వీసుల్లోనూ రానుపోనూ జర్నీలకు 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

TGSRTC Offer : తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు వెళ్లే ప్రయాణికుల టికెట్ ధరలో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కల్పిస్తోంది. బెంగళూరు రూట్ లో నడిచే అన్ని సర్వీసుల్లోనూ రానుపోనూ జర్నీలకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ రాయితీ వల్ల ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.160 ఆదా అవుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ రూట్ లో టికెట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చని సూచించింది.
హైదరాబాద్, బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఎక్కువగా ఉంటారు. వీరు తరచూ ఈ నగరాల మధ్య ప్రయాణాలు చేస్తుంటారు. వీరితో పాటు ఉద్యోగ, వ్యాపారాల నిమ్మి్త్తం హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రయాణాలు చేస్తుంటారు. తెలంగాణలో చెందిన లక్షల మంది బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తుంటారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ అధికారులు ఈ రాయితీని తీసుకువచ్చారు. మరోవైపు శని, ఆదివారాల్లో బెంగుళూరు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బెంగుళూరు పెద్ద సంఖ్యలో ప్రజలు ట్రావెల్ చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు పెంచేందుకు ఈ రాయితీ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు యాజమాన్యం పేర్కొంది. ఈ రాయితీని ఉపయోగించుకుని నగదు ఆదా చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుకున్నారు.
శ్రీశైలానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మహాశివరాత్రి నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు లక్షలాది మంది తరలివస్తారు. ప్రయాణికులు, భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 28 వరకు బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ఆయా రోజుల్లో శివ దీక్షాపరులకు 19 నుంచి 23 వరకు స్పర్శ దర్శనం కల్పిస్తారు. అలాగే ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో భక్తులు రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇతర జిల్లాల నుంచి అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతేడాది 382 బస్సులు నడపగా, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది బస్సుల సంఖ్యను పెంచారు. ఈ ఏడాది 453 బస్సులను నడిపేలా ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రణాళికులు సిద్ధం చేశారు.
సంబంధిత కథనం