తెలుగు న్యూస్ / తెలంగాణ /
Hyderabad to Vijayawada : విజయవాడ రూట్ ప్రయాణికులకు అలర్ట్... టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన TGSRTC, వివరాలివే
TGSRTC Discount Offer: హైదరాబాద్ - విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రూట్‌లో ప్రయాణించే వారికోసం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ఆర్టీసీ డిస్కౌంట్ ఆఫర్
TGSRTC Discount Offer: వర్షాలు, వరదల విపత్తు వేళ తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారికోసం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
ఈ రూట్ లో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు TGSRTC తెలిపింది. రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందని వివరించింది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://tgsrtcbus.in వెబ్ సైట్ ని సంప్రదించవచ్చని పేర్కొంది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ వివరాలను ప్రకటించారు.