TSPSC Group 1 Prelims 2024 : రేపే తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష - పాస్ ఫొటో త‌ప్ప‌నిస‌రి, అభ్యర్థులకు సూచనలివే-tgspsc group 1 prelims exam will be conducted tomorrow read this instrcutions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 1 Prelims 2024 : రేపే తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష - పాస్ ఫొటో త‌ప్ప‌నిస‌రి, అభ్యర్థులకు సూచనలివే

TSPSC Group 1 Prelims 2024 : రేపే తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష - పాస్ ఫొటో త‌ప్ప‌నిస‌రి, అభ్యర్థులకు సూచనలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 08, 2024 12:33 PM IST

TGPSC Group 1 Prelims Updates: తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఆదివారం(జూన్ 9)న రాష్ట్రవ్యాప్తంగా ఎగ్జామ్ జరగనుంది. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఉండనున్నాయి.

 తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024

TGPSC Group 1 Prelims 2024 : ఆదివారం(జూన్ 9) జరిగే  తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు సర్వం సిద్ధమైంది. గత అనుభవాల దృష్ట్యా… ఈసారి ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన చర్యలను చేపట్టారు.

ఉదయం 10.30 గంటలకు ప్రారంభం

తెలంగాణలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం కొద్దిరోజుల కిందట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసి… మరికొన్ని పోస్టులను కలిపి ఈ ప్రకటన ఇచ్చింది. ఇందులో భాగంగా…. రేపు (జూన్‌ ) ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతా కూడా ఉదయం 10 గంటలలోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది.

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను సీబీఆర్‌టీ విధానంలో కాకుండా…. ఓఎంఆర్‌(OMR) పద్ధతిలో నిర్వహించనున్నారు. ముందుగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష నిర్వహించాలని అనుకున్నప్పటికీ… ఈసారి 4.03 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. భారీగా అప్లికేషన్లు రావటంతో ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని కమిషన్ ఇటీవలేనే నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రేపు  జరగబోయే ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్‌ బేస్డ్‌ ఆఫ్‌లైన్‌ విధానంలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది.

ప్రిలిమ్స్ పరీక్ష నేపథ్యంలో అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. 

  • పరీక్షా కేంద్రం యొక్క గేట్లు మూసివేసిన తరువాత అభ్యర్థులను పరీక్షా హాలులోకి అనుమతించరు. సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
  • అభ్యర్థులు A4 పరిమాణ కాగితంపై ముద్రించిన హాల్ టికెట్‌ను లేజర్ ప్రింటర్‌తో తీసుకురావాలి.
  •  ప్రింటెడ్ హాల్ టికెట్‌లో  పేర్కొన్న స్థలంలో  మూడు నెలలకు ముందు తీసుకున్న పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అతికించడం తప్పనిసరి.
  • అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు బూట్లు ధరించి రాకుడదు. చెప్పులు మాత్రమే వేసుకోవాలి
  • అభ్యర్థులు తమ వేళ్లపై మెహెందీ లేదా ఏదైనా ఇతర ప్రింటెడ్ రంగులు ఉంచుకోరాదు. ఫలితంగా బయో మెట్రిక్ ఇబ్బందులు వస్తాయి.
  • ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికకరాలను అనమతించరు.
  •  హాల్ టిక్కెట్ తో పాటు ధ్రువీకరణపత్రం ఉండాలి. 
  • ప్రశ్నపత్రంపై ముద్రించిన సూచనలు తప్పనిసరి పాటించాలి. సూచలను ఒకటికి రెండుసార్లు చదువుకోవాలి.
  • బయోమెట్రిక్‌ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే వీలు ఉండదు. ఈ విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి.

How to Download TSPSC Group 1 Hall Tickets 2024 - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  • తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా కమిషన్ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/  లోకి వెళ్లాలి.
  • TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ - 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ ఓటీఆర్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అడ్మిట్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

 

Whats_app_banner