TGPSC Group 3 Key : తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - ప్రాథమిక కీలు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి-tgpsc group 3 key out at websitenewtspscgovin ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tgpsc Group 3 Key : తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - ప్రాథమిక కీలు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TGPSC Group 3 Key : తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - ప్రాథమిక కీలు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 08, 2025 06:29 PM IST

TGPSC Group 3 Preliminary key Updates : తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 12వ తేదీలోపు పంపాల్సి ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

గ్రూప్ 3 కీ విడుదల
గ్రూప్ 3 కీ విడుదల

TSPSC Group 2 Preliminary Answer Key 2024: తెలంగాణ గ్రూప్ 3 ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ https://websitenew.tspsc.gov.in/ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మూడు పేపర్లు ప్రాథమిక కీలను అందుబాటులో ఉంచారు.

yearly horoscope entry point

ప్రాథమిక కీలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 12వ తేదీ సాయంత్రం 5లోపు పంపాల్సి ఉంటుందని టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. https://websitenew.tspsc.gov.in/viewKeyObjections?accessId=Lhbfuwego2922 లింక్ పై క్లిక్ చేసి అభ్యంతరాలను పంపవచ్చు. అయితే మెయిల్ ద్వారా పంపే అభ్యంతరాలను స్వీకరించబోమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. వెబ్ సైట్ ద్వారా నిర్ణీత ఫార్మాట్ లో తగిన ఆధారాలతో పంపిన వాటినే పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది.

గ్రూప్ 3 కీలను ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • గ్రూప్ 3 రాసిన అభ్యర్థులు https://websitenew.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • గ్రూప్ 3 ప్రిలిమినరీ కీ ఆప్షన్ పై నొక్కాలి.
  • ఆ తర్వాత అభ్యర్థి టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • గెట్ డేటాపై క్లిక్ చేస్తే ప్రాథమిక కీలతో కూడిన మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

గతేడాది నవంబర్ నెలలోనే గ్రూప్ 3 పరీక్షలు జరిగాయి. ఇక గ్రూప్ 3 పరీక్షలను చూస్తే…మూడు పేప‌ర్ల‌కు క‌లిపి మొత్తంగా 50 శాతం మందే హాజ‌రయ్యారు.ఈ గ్రూప్-3 నోటిఫికేష‌న్ ద్వారా 1363 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

గ్రూప్ 3 పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహించారు. ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనున్నారు. గ్రూప్ 3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం… కీలను ప్రకటించి, మెరిట్ జాబితాలను విడుదల చేయనున్నారు.

 

Whats_app_banner