టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్థులకు అలర్ట్ - సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఖరారు, కావాల్సిన పత్రాలివే-tgpsc group 2 candidates certificate verification schedule announced key details chck here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్థులకు అలర్ట్ - సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఖరారు, కావాల్సిన పత్రాలివే

టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్థులకు అలర్ట్ - సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఖరారు, కావాల్సిన పత్రాలివే

గ్రూప్ 2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ధ్రువపత్రాల పరిశీలనకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. మే 29 నుంచి జూన్‌ 10 వరకు సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది.

టీజీపీఎస్సీ గ్రూప్‌-2 అప్డేట్స్ - ధ్రువపత్రాల పరిశీలన షెడ్యూల్‌ విడుదల

గ్రూప్‌-2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన చేసింది. మే 29 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. జూన్‌ 10 వరకు ఈ ప్రక్రియ ఉంటుందని వెల్లడించింది.

ఎక్కడంటే…?

హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లోని సురవరం ప్రతాప్‌ రెడ్డి యూనివర్సిటీ (గతంలో శ్రీ పొట్టి శ్రీరాములు వర్సిటీ)లో గ్రూప్ 2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియను చేపట్టనున్నారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అలాగే.. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.

కావాల్సిన పత్రాలివే…

గ్రూప్ 2 ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచారు. హాల్ టికెట్ నెంబర్లను పేర్కొన్నారు. టీజీపీఎస్సీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… అభ్యర్థులు వెరిఫికేషన్ కు హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఒక సెట్‌ స్వయంగా సంతకం చేసిన ఫొటో కాపీలు తీసుకురావాల్సి ఉంటుంది.

  • అప్లికేషన్ ఫామ్
  • హాల్ టికెట్ పత్రం
  • ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా పాస్ పోర్ట్/ డ్రైవింగ్ లైసెన్స్/ సర్వీస్ ఐడీ కార్డ్స్, పాన్ కార్డు
  • విద్యా అర్హత పత్రాలు
  • పదో తరగతి మెమో
  • ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • రెసిడెన్సీ సర్టిఫికెట్లు
  • స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటే ధ్రువీకరణ పత్రాలు
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఈడబ్యూఎస్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్ సమర్పించాలి.
  • దివ్యాంగ అభ్యర్థులు - సంబంధిత సర్టిఫికెట్లు
  • ఇతర ధ్రువపత్రాలు

తేదీల వారీగా షెడ్యూల్ వివరాలను మే 26వ తేదీన వెబ్ సైట్ లో ఉంచుతారు. మే 27 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం