TGPSC Groups Results : ముగిసిన గ్రూప్ 1 మూల్యాంకనం..! 2, 3 ఫలితాలపై కూడా కసరత్తు-tgpsc group 1 main exams evaluation over merit list is likely to release in february ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Groups Results : ముగిసిన గ్రూప్ 1 మూల్యాంకనం..! 2, 3 ఫలితాలపై కూడా కసరత్తు

TGPSC Groups Results : ముగిసిన గ్రూప్ 1 మూల్యాంకనం..! 2, 3 ఫలితాలపై కూడా కసరత్తు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 30, 2025 12:07 PM IST

గ్రూప్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. అయితే ముందుగా కీలకమైన గ్రూప్ 1 ఫలితాలను ప్రకటించిన తర్వాతే… గ్రూప్ 2, 3 ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణ గ్రూప్స్ ఫలితాలు
తెలంగాణ గ్రూప్స్ ఫలితాలు

గ్రూప్-I మెయిన్ పరీక్షల మూల్యాంకనాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి చేసింది. గతేడాది నవంబర్ మాసంలోనే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కాగా….తాజాగా ఈ ప్రక్రియను ముగించినట్లు తెలిసింది.

మూల్యాంకన ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో మెరిట్ జాబితాపై టీజీపీఎస్సీ ఫోకస్ పెట్టింది. ఒక్క పోస్టుకు ఇద్దరిని ఎంపిక చేసి వారి ధ్రువపత్రాలను పరిశీలించనుంది.

అయితే గ్రూప్ 1 ఫలితాలు వచ్చిన తర్వాత మిగతా పరీక్షల తుది ఫలితాలను ఇవ్వాలని టీజీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మూల్యాంకన ప్రక్రియలో సీనియర్ ప్రొఫెసర్ల సేవలను వినియోగించుకుంది. ఫిబ్రవరి రెండో వారంలోపు మెరిట్ లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఆ దిశగా కమిషన్ కసరత్తు చేస్తోంది.

గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందుకు 21,151 మంది (67.3 శాతం) హాజరయ్యారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. జనరల్ ర్యాకింగ్ లిస్ట్ విడుదలైతే… గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి దాదాపు లైన్ క్లియర్ అవుతోంది.

ఆ తర్వాతే గ్రూప్ 2, 3 ఫలితాలు…!

గ్రూప్ 1 తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాతనే గ్రూప్ 3, గ్రూప్ 2 ఫలితాలను టీజీపీఎస్సీ భావిస్తోంది. గ్రూప్ 1 ఫలితాలు కాకుండా గ్రూప్ 3, 2 ఫలితాలను ప్రకటిస్తే కొన్ని పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉంటుందని అంచనా వేసింది.

ఒకే అభ్యర్థి రెండు, మూడు పోస్టులకు ఎంపికయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఉన్నత స్థాయిలోని పోస్టులను ఎంచుకోవడంతో కిందిస్థాయి పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోయే ఛాన్స్ ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.

ఇప్పటికే గ్రూప్ 2, 3 ప్రాథమిక కీలు కూడా విడుదలయ్యాయి. అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసింది. వీటికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టులు కూడా సిద్ధం చేసే పనిలో టీజీపీఎస్సీ ఉంది. మొత్తంగా చూస్తే మార్చి నెలఖారు నాటికి కీలకమైన గ్రూప్ 1, 2,3 ఫలితాలన్నీ విడుదలయ్యే అవకాశం ఉంది…!

Whats_app_banner

సంబంధిత కథనం