TGPSC Group 2 Exams : తెలంగాణ గ్రూప్-2 పరీక్షలకు 1368 సెంటర్లు ఏర్పాటు, ఈ నెల 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో-tgpsc arrangements for group 2 exam on december 15th and 16th hall tickets available from dec 5th ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tgpsc Group 2 Exams : తెలంగాణ గ్రూప్-2 పరీక్షలకు 1368 సెంటర్లు ఏర్పాటు, ఈ నెల 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో

TGPSC Group 2 Exams : తెలంగాణ గ్రూప్-2 పరీక్షలకు 1368 సెంటర్లు ఏర్పాటు, ఈ నెల 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో

Bandaru Satyaprasad HT Telugu
Dec 07, 2024 10:21 PM IST

TGPSC Group 2 Exams : గ్రూప్-2 పరీక్షలకు టీజీపీఎస్సీ అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల కోసం రాష్ట్ర వ్యప్తంగా 1368 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ నెల 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

తెలంగాణ గ్రూప్-2 పరీక్షలకు 1368 సెంటర్లు ఏర్పాటు, ఈ నెల 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో
తెలంగాణ గ్రూప్-2 పరీక్షలకు 1368 సెంటర్లు ఏర్పాటు, ఈ నెల 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో

తెలంగాణ గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేస్తుంది. ఈ నెల 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీజీపీఎస్సీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 9వ తేదీ గ్రూప్-2 హాల్ టికెట్లను టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 15, 16 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లతో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం సెషన్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను 8.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను 1.30 నుంచి 2.30 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు. ఈ సమయం దాటిపోయిన తర్వాత వచ్చిన వారికి పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని టీజీపీఎస్సీ ప్రకటించింది.

yearly horoscope entry point

డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు

టీజీపీఎస్సీ గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. టీజీపీఎస్సీ షెడ్యూల్ ప్రకారం... పేపర్-1 డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది. ఇక డిసెంబరు 16వ తేదీన పేపర్​3, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-2 ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహించనున్నారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్​టికెట్లు డౌన్​లోడ్​ సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే 040-23542185 లేదా 040-23542187 నంబర్లకు సంప్రదించాలని టీజీపీఎస్సీ తెలిపింది. లేదా Helpdesk@tspsc.gov.in ఈ-మెయిల్‌ సందేహాలు పంపవచ్చని పేర్కొంది.

టీజీపీఎస్సీ గ్రూప్ 2 హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులు TGPSC వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ పై క్లిక్ చేయాలి.
  • హోం పేజీలో కనిపించే Download Hall Ticket For Group-II Services ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత ఓపెన్ అయ్యే విండోలో టీజీపీఎస్సీ ఐడీ , పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయండి.
  • డౌన్లోడ్ పీడీఎఫ్ పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.

హెచ్సీయూలో 42 బ్యాక్ లాగ్ పోస్టులు

హైదరాబాద్‌ సెంట్రల్ వర్శిటీలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటంది. మొత్తం 42 బ్యాక్ లాగ్ ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా 21 అసోసియేట్ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.సైన్స్‌, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్‌, మేనేజ్‌మెంట్ స్టడీస్, హ్యుమానిటీస్, ఎకనామిక్స్‌ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు విధానం

అర్హులైన అభ్యర్థులు https://uohyd.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం రూ. 1000 చెల్లించాలి. ఆన్ లైన్ లోనే కాకుండా ఆఫ్ లైన్ లో కూడా అప్లికేషన్లు పంపవచ్చు. ఇందుకు డిసెంబర్ 16వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆన్ లైన్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని వివరాలను నింపాలి. పూర్తి చేసిన ఫామ్ ను ఆఫ్‌లైన్ అప్లికేషన్లను ‘ ది అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్‌మెంట్ సెల్, రూమ్ నంబర్‌:- 221, మొదటి అంతస్తు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ప్రొఫెసర్, సి.ఆర్‌. రావు రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్- 500 04’ చిరునామాకు పంపించాలి.

Whats_app_banner

సంబంధిత కథనం