TGPSC AE Provisional List : టీజీపీఎస్సీ ఏఈ పోస్టుల భర్తీ, 650 అభ్యర్థులతో జాబితా విడుదల
TGPSC AE Provisional List : తెలంగాణ ఏఈ ప్రొవిజినల్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఏఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మొత్తం 650 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
TGPSC AE Provisional List : తెలంగాణ ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లో సివిల్ కేటగిరీ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ అధికారులు, సూపర్ వైజర్ పోస్టులకు ఎంపికైన 650 మంది అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ పోస్టులకు మూడు విడతలుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టులకు 2023లో రాత పరీక్ష నిర్వహించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మూడు దఫాలుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టింది టీజీపీఎస్సీ. అసిస్టెంట్ ఇంజినీర్, సివిల్ సబ్జెక్ట్ పోస్టులకు తాత్కాలికంగా అభ్యర్థులను ఎంపిక చేశారు.
నియామక అధికారి పరిశీలన తర్వాతే
1. పరీక్షలో విజయం సాధించినప్పటికీ, నియామక అధికారి అవసరమైన పరిశీలన తర్వాత, అభ్యర్థి వ్యక్తిత్వం, ఇతర వివరాలను పరిగణనలోకి తీసుకుని, సర్వీస్‌కు నియామకానికి అన్ని విధాలుగా తగినవారకి మాత్రమే పోస్టింగ్ కల్పి్స్తారు.
2. నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాలి.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇతర అన్ని వెరిఫికేషన్లు పూర్తయిన తర్వాత, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టులకు 650 మంది అభ్యర్థులను జాబితాను ప్రకటించినట్లు టీజీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు వివరాల కోసం కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in ను సందర్శించాలని సూచించారు.
ఏఈ ప్రొవిజినల్ జాబితాను ఇలా చెక్ చేసుకోవచ్చు?
- TGPSC వెబ్‌సైట్ https://www.tspsc.gov.in కి వెళ్లండి
- వెబ్ సైట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- వెబ్ సైట్ హోంపేజీలో ఏఈ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి
- ఎంపికైన అభ్యర్థుల జాబితాలో మీ రోల్ నంబర్ కోసం చెక్ చేసుకోండి
తెలంగాణ మున్సిపల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ 832 పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్ విడుదలైంది. 2023 అక్టోబర్ లో రాత పరీక్షలు నిర్వహించారు. వీటి తుది ఫలితాలను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) సివిల్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.