TG TET 2024 II Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు మరో అప్డేట్... వెబ్‌సైట్‌లో 'ఎడిట్ ఆప్షన్' వచ్చేసింది..!
TG TET 2024 II Applications Updates : తెలంగాణ టెట్ -2 దరఖాస్తులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 20వ తేదీతో అప్లికేషన్ల గడువు పూర్తి కానుంది.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 (II) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు నవంబర్ 20వ తేదీతో పూర్తి కానుంది. నవంబర్ 16వ తేదీ నాటికి మొత్తం 1,26 వేలకు పైగా అప్లికేషన్లు అందాయి. మరికొద్దిరోజులే గడువు ఉండటంతో అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే అప్లికేషన్లకు సంబంధించి విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
అప్లికేషన్లలో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఎడిట్ అప్లికేషన్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఎడిట్ ఆప్షన్ తో మీ దరఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ అవకాశం ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఒక్కసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తే… మళ్లీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
ఇలా ఎడిట్ చేసుకోండి…
- తెలంగాణ టెట్ (2)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇక్కడ తెలంగాణ టెట్ - 2 లింక్ పై క్లిక్ పై చేయాలి.
- కొత్తగా ఓపెన్ అయ్యే విండో హోం పేజీలో Edit Application అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.
- ఇక్కడ Journal Number, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
- మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.
- చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఎడిట్ పూర్తి అవుతుంది.
- ప్రింట్ అప్లికేషన్ పై క్లిక్ చేసి మీ దరఖాస్తు ఫారమ్ ను పొందవచ్చు.
తెలంగాణ టెట్ దరఖాస్తు విధానం:
- టెట్ రాసే అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా https://tgtet2024.aptonline.in/tgtet/# వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ముందుగా ‘Fee Payment’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
- పేమెంట్ స్టెటస్ అనే కాలమ్ పై నొక్కి దరఖాస్తు రుసుం చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిందా..? లేదా అనేది చెక్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ‘Application Submission’ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
- మీ వివరాలను నమోదు చేయాలి. ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- అన్ని వివరాలను ఎంట్రీ చేశాక చివర్లో ఉండే సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
- 'Print Application' అనే ఆప్షన్ పై నొక్కితే మీ దరఖాస్తు కాపీనీ డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 26 డిసెంబర్ 2024న విడుదలవుతాయి. జనవరి 1, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. జనవరి 20, 2025తో ముగుస్తాయి. ఫిబ్రవరి 5వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. ఈ టెట్ పూర్తి అయ్యే సమయానికి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
సంబంధిత కథనం