TG New Ration Cards : కొత్త రేషన్ కార్డు జాబితాలో మీ పేరు లేదా? అయితే ఇలా దరఖాస్తు చేసుకోండి
TG New Ration Cards : తెలంగాణలో ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటికే జాబితాలు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. జాబితాల్లో తమ పేర్లు లేవని పలువులు ఆందోళన చెందుతున్నారు. నేటి నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
TG New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి నాలుగు కొత్త పథకాలు ప్రారభించనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో కొత్త రేషన్ కార్డులు ఒకటి. సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు ఎంతో కీలకం. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులకు ఎంపికైన వారి పూర్తి స్థాయి జాబితాలు విడుదల కానున్నాయి. అయితే పలుచోట్ల అధికారుల అత్యుత్సాహంలో జాబితాలు లీక్ అయ్యాయి. వీటిల్లో తమ పేర్లు లేమని ప్రజలు గగ్గోలుపెడుతున్నాయి. జాబితాల్లో పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రులు, అధికారులు సూచిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు అర్హులను గ్రామసభల్లో నిర్ణయిస్తామని అధికారులు ప్రకటించారు.
రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇకపై నిరంతరం కొనసాగుతుందని మంత్రులు క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డులకు సంబంధించిన జాబితాలో పేర్లు లేనివారి ఈ నెల 21 నుంచి 24 వరకు వారి గ్రామాల్లో జరిగే గ్రామ సభల్లో కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోచ్చని పౌరసరఫరాల శాఖ పేర్కొంది. అలాగే ప్రస్తుతం ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను జోడించడం కోసం వచ్చిన 12,07,558 దరఖాస్తుల్లో...18,00,515 మంది పేర్లను అర్హతల మేరకు చేర్చనున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తామని పౌరసరఫరాల శాఖ తెలిపింది.
నేటి నుంచి గ్రామసభలు
నేటి నుంచి ఈనెల 24న వరకు గ్రామసభలు నిర్వహించినట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 11,65,052 మందికి సంబంధించిన 6,68,309 కార్డుల సమాచారాన్ని సిద్ధం చేసినట్లు సీఎస్ శాంతి కుమారి చెప్పారు. మరో 1.36 కోట్ల మందికి సంబంధించి 41.25 లక్షల కార్డుల సమాచారాన్ని అవసరానికి అనుగుణంగా తెలియజేస్తామన్నారు. నేటి నుంచి జరిగే గ్రామసభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, అడ్రస్, ఫోన్ నంబర్, కులానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలని సూచించారు.
జాబితాలో పేరు లేకపోతే?
రేషన్ కార్డుల జాబితాలో పేర్లు లేని వారు గ్రామసభలో దరఖాస్తు పూర్తిచేసి అధికారులకు అందజేయాలి. అధికారులు దరఖాస్తులు పరిశీలించి, అన్ని అర్హతలు ఉంటే రేషన్ కార్డులను అందించేందుకు ఆదేశాలు ఇస్తారు. అధికారుల అడిగే సమాచారాన్ని ప్రజలు తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలి. హైదరాబాద్ వంటి నగరాలు, పట్టణాల్లోని వార్డుల్లో కూడా సభలు ఏర్పాటు చేయనున్నారు.
సామాజిక ఆర్థిక కులగణన సమయంలో చాలా మంది రేషన్ కార్డు లేదని చెప్పడంతో ఆ వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేసుకుని...ఈ జాబితాను పై అధికారులకు పంపించారు. అక్కడ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జాబితాలు సిద్ధం చేస్తు్న్నారు. దీంతో అనేక మంది అర్హులైన వారి పేర్లు జాబితాల్లో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కులగణన సర్వేలో వివరాలు సమర్పించినా...కొందరి పేర్లు జాబితాల్లో కనిపించడం లేదు. కంప్యూటరీకరించే సమయంలో పేర్లు గల్లంతు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెరిఫికేషన్ కోసం వస్తున్న వారిని ప్రజలు...తమ పేర్లు ఉన్నాయో? లేదో? అని ఆరా తీస్తున్నారు. వారి పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రేషన్ కార్డులపై ఉన్న సందేహాలు ఈ నెల 26 క్లియర్ అవుతాయని మరికొందరు అంటున్నారు. పూర్తిస్థాయి జాబితాలు విడుదల అయితే ఏ ప్రతిపాదికన లిస్ట్ లు సిద్ధం తెలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత కథనం