TG Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు-tg intermediate exam fee payment period extended with late fee details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

TG Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

Bandaru Satyaprasad HT Telugu
Jan 06, 2025 11:08 PM IST

TG Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 16 వరకు పొడిగించారు. అపరాధ రుసుము రూ.2500 తో ఈ నెల 16 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

 తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

TG Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. రూ.2500 లేటు ఫీజుతో ఈ నెల 16 వరకు చెల్లించవచ్చని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

yearly horoscope entry point

ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫీజు చెల్లించాల్సిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించారు. ఇప్పటికే రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 31వ తేదీ వరకు ఫీజు చెల్లింపు గడువు ఇచ్చారు. నిజానికి ఈ గడువు డిసెంబర్ 17వ తేదీతోనే ముగియాలి. ఇటీవల డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించారు. రూ.2000 వేల ఆలస్య రుసుముతో జనవరి 2వరకు అవకాశం ఇచ్చారు. అయితే తాజాగా రూ.2500 లేట్ ఫీజుతో జనవరి 16 వరకు గడువు పొడిగించారు.

ఇంటర్ ఫస్టియర్ జనరల్ రెగ్యులర్ కోర్సుల ఫీజును రూ.520గా నిర్ణయించారు. ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ రెగ్యులర్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు రూ.750గా ఉంది. ఇంటర్ సెకండియర్ జనరల్ ఆర్ట్స్ కోర్సుల ఫీజు రూ.520, సెకండియర్ జనరల్ సైన్స్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు రూ.750గా ఉంది. సెకండియర్ ఒకేషనల్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు రూ.750 చెల్లించాలి. వీటికి తోడు ఆలస్య రుసుం కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు

ఇంటర్ రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 3, 2025 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 22, 2025తో పూర్తి అవుతాయి. రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు… మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తారు. ఇక తుది పరీక్షల టైం టేబుల్ ను కూడా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • మార్చి 5, 2025(బుధవారం)- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
  • మార్చి 7, 2025(శుక్రవారం)- ఇంగ్లీష్ పేపర్-1
  • మార్చి 11, 2025(మంగళవారం) -మ్యాథ్స్ పేపర్-1ఏ, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
  • మార్చి 13, 2025(గురువారం)-మ్యాథ్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
  • మార్చి 17, 2025 (సోమవారం) -ఫిజిక్స్ పేపర్-1, ఎనకామిక్స్ పేపర్-1
  • మార్చి 19, 2025(బుధవారం) -కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
  • మార్చి 21,2025(శుక్రవారం)-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-1(బైపీసీ విద్యార్థులకు)
  • మార్చి 24, 2025(సోమవారం)-మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • మార్చి 6 , 2025(గురువారం)- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
  • మార్చి 10, 2025(సోమవారం)- ఇంగ్లీష్ పేపర్-2
  • మార్చి 12, 2025(బుధవారం) -మ్యాథ్స్ పేపర్-2ఏ, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
  • మార్చి 15, 2025(శనివారం)-మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
  • మార్చి 18, 2025 (మంగళవారం) -ఫిజిక్స్ పేపర్-2, ఎనకామిక్స్ పేపర్-2
  • మార్చి 20, 2025(గురువారం) -కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
  • మార్చి 22,2025(శనివారం)-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-2(బైపీసీ విద్యార్థులకు)
  • మార్చి 25, 2025(మంగళవారం)-మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్ -2.

Whats_app_banner

సంబంధిత కథనం