Game Changer : గేమ్ ఛేంజర్ కు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్- స్పెషల్ షోలు, టికెట్ల ధరల పెంపు నిర్ణయం వెనక్కి-tg govt withdraws additional show tickets rate hike to ram charan game changer on high court orders ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Game Changer : గేమ్ ఛేంజర్ కు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్- స్పెషల్ షోలు, టికెట్ల ధరల పెంపు నిర్ణయం వెనక్కి

Game Changer : గేమ్ ఛేంజర్ కు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్- స్పెషల్ షోలు, టికెట్ల ధరల పెంపు నిర్ణయం వెనక్కి

Bandaru Satyaprasad HT Telugu
Jan 11, 2025 10:34 PM IST

Game Changer : గేమ్ ఛేంజర్ తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో స్పెషల్ షోలు, ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

గేమ్ ఛేంజర్ కు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్- స్పెషల్ షోలు, టికెట్ల ధరల పెంపు నిర్ణయం వెనక్కి
గేమ్ ఛేంజర్ కు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్- స్పెషల్ షోలు, టికెట్ల ధరల పెంపు నిర్ణయం వెనక్కి

Game Changer : ఏపీ, తెలంగాణ హైకోర్టుల ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గేమ్ ఛేంజర్ కు షాక్ ఇచ్చాయి. అదనపు షోలు, రేట్ల విషయంలో ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. తాజాగా గేమ్‌ ఛేంజర్‌ మూవీ టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. టికెట్‌ ధరల పెంపు విషయంలో ఇచ్చిన వెసులుబాటును ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో గేమ్‌ ఛేంజర్‌ టికెట్ ధరలు, అదనపు షోలకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించింది. తెలంగాణలో ఇకపై తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యం, భద్రత నేపథ్యంలో సినిమాల స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

yearly horoscope entry point

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా డైరెక్టర్ శంకర్‌ దర్శక్వతంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి సినిమా యూనిట్ విజ్ఞప్తితో టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గేమ్ ఛేంజర్ విడుదల రోజు (జనవరి 10న) ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజు సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ల రేటుపై రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.150 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీఫ్లెక్సుల్లో రూ.100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాలతో అదనపు షోలు, టికెట్ల రేట్ల పెంపుపై ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

అదనపు షోల అనుమతి రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీ హైకోర్టు ఆదేశాలతో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాల అదనపు షోలు, టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. గేమ్ ఛేంజర్ సినిమాపై ఇచ్చిన ఉత్తర్వులు కేవలం టికెట్ ధరలకు సంబంధించినది మాత్రమేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సరైన భద్రత లేని థియేటర్లకు వచ్చే ప్రజలను నియంత్రించడం కష్టమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు అదనపు షోలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటలకు అదనపు షోలకు అనుమతిని రద్దుచేసింది. 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు మించకుండా సినిమా ప్రదర్శించుకోవచ్చని పేర్కొంది. రోజుకు 5 షోలలో ఒకటి బెనిఫిట్ షోగా నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం