TG Beer Price Hike : మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ షాక్, బీర్ల ధరలు 15 శాతం పెంపు-రేపటి నుంచి అమల్లోకి
TG Beer Price Hike : మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. వేసవి ముందు షాక్ ఇస్తూ బీర్ల ధరలను ప్రస్తుత రేట్లపై 15 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. బీర్ల ధరలు పెంపు రేపటి నుంచి అమల్లోకి రానుంది.

TG Beer Price Hike : తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. బీర్ల ధరలను 15 శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ధరపై ఈ పెంపు ఉన్నట్లు వెల్లడించింది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. వేసవిలో చల్లటి బీరుతో చిల్ అవుదామనుకుంటున్న మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బీర్లపై అమాంతం 15 శాతం పెంచింది. దీంతో మందుబాబులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. జస్టిస్ జైస్వాల్ కమిటీ సిఫార్సుల మేరకు బీర్ల ధరలను ఎక్సైజ్ శాఖ సవరించింది.
మద్యంపై భారీగా ట్యాక్స్
మద్యం ప్రభుత్వాలకు కాసుల పంట కురుపిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ట్యాక్స్ టాప్ అని తెలుస్తోంది. రాష్ట్రంలోని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులు గత రెండేళ్లలో 300% పెరిగాయి. ఈ పెరుగుదలకు రాష్ట్రంలో 140% నుంచి 250% వరకు ఉండే అధిక పన్నులు అని సమాచారం. తెలంగాణలో లిక్కర్‌పై 70% వ్యాట్ ఉండగా, ఎక్సైజ్ డ్యూటీ 70% నుంచి 120% వరకు విధిస్తారు. విదేశీ మద్యం విషయంలో, ఈ ఎక్సైజ్ సుంకం 150% వరకు విధిస్తారు. ఇది మొత్తం పన్నును 220% నుండి 250% వరకు పెంచుతారు.
ఏపీలో కూడా మద్యం ధరలు పెంపు
ఏపీలో కూడా మద్యం ధరలు 15 శాతం మేరు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15 శాతం మేర మద్యం ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్, బీర్లు...ఇలా మూడు కేటగిరీల్లో మద్యం సరఫరా చేస్తున్నారు. ప్రైవేట్ మద్యం పాలసీ ప్రకారం అమ్మకాలపై దుకాణదారులకు 14.5 శాతం మార్జిన్ చేస్తున్నారు.
ఈ మార్జిన్ సరిపోవడంలేదని దుకాణదారులు ఆందోళన చేయడంతో...కమిషన్ 14.5 నుంచి 20 శాతం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో అన్ని కేటగిరీల్లో మద్యం ధరలను 15 శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన చేసింది. అయితే రూ.99కు అమ్మే బ్రాండ్, బీరు మినహా ఇతర అన్ని కేటగిరీల్లో మద్యం ధరలు పెంచారు.
సంబంధిత కథనం