TG Inter Sankranti Holidays : తెలంగాణ ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటన, ఎన్ని రోజులంటే?
TG Inter Sankranti Holidays : తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 11 నుంచి 16 వరకు 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులుగా నిర్ణయించింది.
TG Inter Sankranti Holidays : ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ శుక్రవారం తిరిగి కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని స్కూళ్లకు ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ప్రైవేట్ అన్-ఎయిడెడ్, కో-ఆపరేటివ్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్, ఆర్జేసీ, కేజీబీవీ, ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలు, రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సును అందిస్తున్న కాంపోజిట్ డిగ్రీ కళాశాలలకు సంక్రాంతికి సెలవులు ప్రకటించారు. 11-01-2025 నుంచి 16-01-2025 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 17-01-2025 (శుక్రవారం)న తిరిగి కాలేజీలు తెరుస్తారు.
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, ప్రిన్సిపల్స్ అందరూ సెలవుల షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించవలసిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, మేనేజ్‌మెంట్‌లను సెలవుల్లో ఎటువంటి తరగతులు నిర్వహించవద్దని ఆదేశించారు. ఈ సూచనలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తప్పు చేసిన మేనేజ్‌మెంట్‌లు, ప్రిన్సిపల్స్‌పై చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్ బోర్టు సెక్రటరీ హెచ్చరించారు.
తెలంగాణ స్కూళ్లకు సంక్రాంతి సెలవులు
తెలంగాణలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇన్ని రోజులు జరుగుతున్న ప్రచారానికి ఫుల్స్టాప్పెట్టింది. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న అంటే శనివారం తెరుచుకోనున్నాయి. సెలవులపై క్లారిటీ రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను సొంతూళ్లకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. సంక్రాంతి మూడు రోజులు సెలవులు ఉంది. జనవరి 13వ తేదీన భోగి, జనవరి 14వ తేదీన సంక్రాంతి ఉంది. ఈ సెలవులను జనరల్ హాలీడేస్‌గా పేర్కొంది. ఇక ఆప్షన్ హాలీ డేస్ కింద జనవరి 15వ తేదీన కనుమ ఉంది. ప్రభుత్వం ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం అయితే మూడు రోజులు మాత్రమే ఉంటుంది. కానీ.. తాజాగా మార్పులను ప్రభుత్వం ప్రకటించి.. జనవరి 11 నుంచి 17 వరకు సెలవులు ఇచ్చింది. ఈ2025 ఏడాదికి గానూ సాధారణ, ఆప్షనల్ సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఇటీవలనే ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాదిలో మొత్తం 27 సాధారణ సెలవులు ఉంటాయని పేర్కొంది. ఇక 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.
సంబంధిత కథనం