TG CPGET 2024 Updates : పీజీ కోర్సుల్లో ప్రవేశాలు - సీపీగెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి-tg cpget 2024 hall tickets 2024 available at https cpget tsche ac in key dates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Cpget 2024 Updates : పీజీ కోర్సుల్లో ప్రవేశాలు - సీపీగెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TG CPGET 2024 Updates : పీజీ కోర్సుల్లో ప్రవేశాలు - సీపీగెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 05, 2024 01:43 PM IST

TG CPGET 2024 Hall Tickets 2024: జూలై 6వ తేదీ నుంచి తెలంగాణ సీపీగెట్ 2024 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

 సీపీగెట్ హాల్ టికెట్లు విడుదల
సీపీగెట్ హాల్ టికెట్లు విడుదల

TG CPGET 2024 Hall Tickets 2024: తెలంగాణ సీపీగెట్ (TS CPGET 2024) పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పరీక్షలు జూలై 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

yearly horoscope entry point

ఇలా డౌన్లోడ్ చేసుకోండి….

  • సీపీగెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే Download Hall Ticket అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ Registration Number, పుట్టిన తేదీ వివరాలతో పాటు Exam Paper for Entrance Test ఆప్షన్ ను ఎంచుకోవాలి.
  • డౌన్లోడ్ హాల్ టికెట్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

జూలై 6 నుంచి పరీక్షలు….

ఇటీవలే సీపీగెట్ పరీక్షల షెడ్యూల్ తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించిన సంగతి తెలిసిందే. జూలై 17వ తేదీతో ఈ పరీక్షలన్నీ పూర్తి కానున్నాయి.రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంపీఈడీ కోర్సు ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ సీపీగెట్ నిర్వహిస్తోంది.

రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఉన్న 297 పీజీ కాలేజీల్లో 51 కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్‌ నిర్వహిస్తున్నారు.

సీపీగెట్ పరీక్షలను జూలై 6వ తేదీ నుంచి కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు.సీపీగెట్‌ పూర్తి వివరాలను www.osmania.ac.in, www.ouadmissions.com, www.cpget.tsche.ac.in వెబ్‌సైట్లలో చూడొచ్చు.

ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 1 నుంచి 2.30 వరకు రెండో సెషన్ ఉంటుంది. ఇక సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు మూడో సెషన్ పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)కు పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందుగా చేరుకోవాలని అధికారులు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీపీగెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఎంబీబీఎస్, బీటెక్‌ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్‌ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్‌ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే అవుతారు.

మొత్తం 100 మార్కులకు సీపీగెట్ పరీక్ష నిర్వహిస్తారు.ఈ ఏడాది ఉస్మానియా వర్శిటీ నిర్వహిస్తోంది. ప్రశ్నాపత్రంలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్ అండ్ మైక్రోబయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ పార్ట్-ఎలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్ బిలో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీల్లోని ఆప్షనల్ సబ్జెక్టు (బీఎస్సీలో చదివిన) నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. బయోటెక్నాలజీ పేపర్‌లో పార్ట్-ఎ (కెమిస్ట్రీ)లో 40 ప్రశ్నలు, పార్ట్-బి (బయోటెక్నాలజీ)లో 60 ప్రశ్నలు అడుగుతారు. ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

Whats_app_banner