Telangana Budget Live Updates : అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి - 6 గ్యారెంటీలకు పెద్దపీట
- Telangana Budget 2024 Live Updates: ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ -2024ను ప్రవేశపెట్టింది. ఉదయం భేటీ అయిన మంత్రివర్గం…. పద్దుకు ఆమోదముద్ర వేసింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
Sat, 10 Feb 202407:54 AM IST
అసెంబ్లీ వాయిదా
బడ్దెట్ ప్రసంగం పూర్తి అయిన తర్వాత… సభను వాయిదా వేశారు స్పీకర్. సోమవారం సభ ప్రారంభమవుతుందని చెప్పారు.
Sat, 10 Feb 202407:53 AM IST
భట్టి ప్రసంగం ముగింపు
జై తెలంగాణ… జై హిందూ అంటూ భట్టి తన ప్రసంగాన్ని ముగించారు.
Sat, 10 Feb 202407:52 AM IST
ఇందిరమ్మ రాజ్యం…
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం కృషి చేస్తామని చెప్పారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.
Sat, 10 Feb 202407:52 AM IST
అదే మా లక్ష్యం
తెలంగాణ ప్రజల సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు భట్టి. నిధులు ఎలా సమకూర్చుకోవాలనే దానిపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు.
Sat, 10 Feb 202407:52 AM IST
వాహనాల కోడ్ టీజీ
వాహనాల కోడ్ ను టీజీగా మారుస్తున్నాం. తెలంగాణ కీర్తిని ప్రతిబింబిచేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని భట్టి చెప్పారు.
Sat, 10 Feb 202407:49 AM IST
రాష్ట్ర గీతంపై ప్రకటన
అందే శ్రీ రాసిన జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తున్నామని ఆర్థిక మంత్రి భట్టి తెలిపారు.
Sat, 10 Feb 202407:46 AM IST
వంద ఎకరాల్లో హైకోర్టు నిర్మాణం
వంద ఎకరాల్లో హైకోర్టు నిర్మాణం చేపడుతున్నామని భట్టి తెలిపారు.
Sat, 10 Feb 202407:46 AM IST
టీఎస్పీఎస్సీకి నిధులు
tSPSCకి రూ. 40 కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి ప్రకటించారు. డ్రగ్స్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
Sat, 10 Feb 202407:46 AM IST
రూ. 5 లక్షల సాయం
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం అందజేస్తామని భట్టి తన ప్రసంగంలో చెప్పారు.
Sat, 10 Feb 202407:46 AM IST
గద్దర్ అవార్డులు
నంది అవార్డులను గద్దర్ అవార్డుగా మారుస్తున్నట్లు భట్టి ప్రకటించారు.
Sat, 10 Feb 202407:46 AM IST
ఇళ్ల స్కీమ్ కేటాయింపులు
ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం రూ. 7740 కోట్లు కేటాయింపు.
Sat, 10 Feb 202407:46 AM IST
రాష్ట్ర చిహ్నాం మారుస్తాం - భట్టి
రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తామని తెలిపారు ఆర్థిక మంత్రి భట్టి. రాజ్యంగ స్పూర్తితో ప్రజాస్వామ్యం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త చిహ్నం ఉంటుందన్నారు. వాహన రిజిస్ట్రేషన్ కోడ్‌ను టీఎస్ నుంచి టీజీగా మార్పు చేశామని…. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Sat, 10 Feb 202407:46 AM IST
పంటల బీమా
రాష్ట్రంలో పకడ్బందీగా పంటల బీమాను అమలు చేస్తామన్నారు భట్టి. చేనేత సమస్యలను పరిష్కారిస్తామని చెప్పారు.
Sat, 10 Feb 202407:46 AM IST
త్వరలో మెగా డీఎస్సీ
మెగా డీఎస్సీ ప్రకటన ఇస్తాం. కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ప్రకటన ఇస్తామని భట్టి తెలిపారు.
Sat, 10 Feb 202407:46 AM IST
అభివృద్ధి చేస్తాం
కాకతీయ మెగా టెక్స్ టైల్స్ ను అభివృద్ధ చేస్తామని భట్టి తెలిపారు. థేమ్స్ నది తరహాలో మూసిని అభివృద్ధి చేస్తామన్నారు.
Sat, 10 Feb 202407:20 AM IST
నిబంధనలను మారుస్తాం - భట్టి
రైతుబంధు నిబంధనలను మారుస్తామని భట్టి ప్రకటించారు. కౌలు రైతులకు రైతీబీమా తీసుకువస్తామని చెప్పారు.
Sat, 10 Feb 202407:20 AM IST
త్వరలో రైతుభరోసా
రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. శనివారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్దెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన ఆయన… రుణమాఫీ విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయబోతున్నామని చెప్పారు. రూ. 2 లక్షలలోపు రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. రైతుబంధు మంచి పథకమే అయినప్పటికీ… సాగు చేయనివారికి కూడా డబ్బులు ఇవ్వటం సరికాదని అభిప్రాయపడ్డారు. రైతుబంధు నిబంధనలను సవరిస్తామని ప్రకటిస్తున్నానని చెప్పారు. రైతుభరోసా కింద పంటపెట్టుబడి సాయం అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో నకిలీ విత్తనాల సమస్య ఉండేదని… అలాంటి వాటికి అవకాశం లేకుండా తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని భట్టి స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ లో పూర్తిస్థాయిలో మార్పులు చేసి… అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అడుగులు వేస్తున్నామని భట్టి ప్రకటించారు.
Sat, 10 Feb 202407:08 AM IST
రుణమాఫీపై ప్రకటన
తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి. రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రైతుల రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు భట్టి విక్రమార్క.
Sat, 10 Feb 202407:20 AM IST
తెలంగాణ బడ్జెట్:
- పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు.
- ఐటీ శాఖకు రూ.774 కోట్లు.
- పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు.
- పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు.
- వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు.
- ఎస్సీ సంక్షేమం రూ. 21,874 కోట్లు.
- ఎస్టీ సంక్షేమం రూ.13,013 కోట్లు.
- మైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు.
Sat, 10 Feb 202406:59 AM IST
బడ్జెట్ కేటాయింపులు:
మూసీ ప్రాజెక్టుకు - రూ. 1000 కోట్లు కేటాయింపు.
పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు.
ఐటీ శాఖకు రూ.774 కోట్లు.
పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు.
పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు కేటాయింపు.
వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు.
ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250 కోట్లు కేటాయింపు.
ఎస్సీ సంక్షేమం రూ. 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ.13,013, రూ. మైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు కేటాయింపు.
బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు.
బీసీ సంక్షేమం రూ8 వేల కోట్లు కేటాయింపు.
విద్యా రంగానికి రూ.21,389 కోట్లు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు.
యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు కేటాయింపు.
వైద్య రంగానికి రూ.11,500 కోట్లు.
విద్యుత్ గృహ జ్యోతికి రూ.2,418 కోట్లు. విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు కేటాయంపు.
గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు. నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు కేటాయిస్తున్నట్లు భట్టి ప్రకటించారు.
Sat, 10 Feb 202406:53 AM IST
తెలంగాణ బడ్జెట్
తెలంగాణ ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలోప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి… తెలంగాణ ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను తీసుకువచ్చినట్లు వివరించారు.
Sat, 10 Feb 202406:51 AM IST
తెలంగాణ బడ్జెట్ 2024- 2025:
రూ.2,75,891 కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్(2024- 2025:).
రెవెన్యూ వ్యయం -2,01,178 కోట్లు.
మూల ధన వ్యయం - 29,669 కోట్లు.
ఆరు గ్యారెంటీల కోసం - రూ.53,196 కోట్లు అంచనా.
Sat, 10 Feb 202406:50 AM IST
తెలంగాణ బడ్జెట్
రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్
Sat, 10 Feb 202406:44 AM IST
వాస్తవాలను ప్రతిబింబించేలా
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు విరుద్ధంగా ఉందన్నారు భట్టి విక్రమార్క. కానీ తమ ప్రభుత్వం అలా కాకుండా… వాస్తవాలను ప్రతిబింబించేలా రూపొందించామని స్పష్టం చేశారు. దళితబంధుకు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు కానీ… ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలు పథకాల వివరాలను సభ ముందు ఉంచారు భట్టి విక్రమార్క.
Sat, 10 Feb 202406:41 AM IST
భట్టి ప్రసంగం
ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన భట్టి…. సమాన్వతమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గుణాత్మక మార్పు తీసుకురావటమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఎలాంటి త్యాగాలకైనా సర్కార్ సిద్ధంగా ఉంటుందని… ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు.
Sat, 10 Feb 202406:38 AM IST
బడ్జెట్
రాష్ట్ర శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క… మధ్యాహ్నం 12 తర్వాత పద్దును సభ ముందు ఉంచారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు.
Sat, 10 Feb 202406:33 AM IST
మండలిలో బడ్జెట్
శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి తరపున ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
Sat, 10 Feb 202406:33 AM IST
ఆరు గ్యారెంటీలపై ఫోకస్
కాసేపట్లో సభ ముందుకు బడ్జెట్ రానుంది. ప్రధానంగా ఆరు గ్యారెంటీలకు కేటాయింపులు ఉండే అవకాశం ఉంది.
Sat, 10 Feb 202406:16 AM IST
కేసీఆర్ హాజరుపై సందిగ్ధత..!
కేసీఆర్ హాజరుపై సందిగ్ధత నెలకొంది. ఇవాళ కూడా రాకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
Sat, 10 Feb 202406:07 AM IST
గతం కంటే తక్కువగా….!
గత బడ్జెట్ తో పోల్చితే… ఈసారి బడ్జెట్ తగ్గే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Sat, 10 Feb 202405:58 AM IST
సభ ముందుకు పద్దు….
మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయంలో శాసనమండలిలో కూడా మంత్రి శ్రీధర్ బాబు పద్దును ప్రవేశపెడుతారు.
Sat, 10 Feb 202405:58 AM IST
కాసేపట్లో బడ్జెట్
కాసేపట్లో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క సభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
Sat, 10 Feb 202405:39 AM IST
సభకు రానున్న కేసీఆర్….
కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో శనివారం తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు.
Sat, 10 Feb 202405:23 AM IST
పూర్తిస్థాయి బడ్జెట్ అప్పుడే
పార్లమెంట్ ఎన్నికల అనంతరం జూన్ లేదా జూలై నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Sat, 10 Feb 202405:23 AM IST
మండలిలో శ్రీధర్ బాబు
శాసనమండలిలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
Sat, 10 Feb 202405:23 AM IST
డైలాగ్ వార్
ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా లోతుగా చర్చ జరిగే అవకాశం ఉంది.
Sat, 10 Feb 202404:58 AM IST
13వకు సమావేశాలు
ఫిబ్రవరి 13వ తేదీ వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి.
Sat, 10 Feb 202404:51 AM IST
ఎక్కువ కేటాయింపులు….
ఈ బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకు కేటాయింపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
Sat, 10 Feb 202404:42 AM IST
ఇవాళ అసెంబ్లీకి కేసీఆర్….
ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో తొలిసారి అసెంబ్లీకి హాజరుకానున్నారు.
Sat, 10 Feb 202404:42 AM IST
అసెంబ్లీకి చేరుకున్న సీఎం, భట్టి
బడ్డెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అసెంబ్లీకి చేరుకున్నారు.
Sat, 10 Feb 202404:34 AM IST
2009లో ఎమ్మెల్యేగా…..
తొలిసారి 2009లో శాసనసభకు ఎన్నికై కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా, డిప్యూటీ స్పీకర్ గా పని చేసిన విక్రమార్క 2018 నుంచి 2023 వరకు శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు అత్యంత కీలకమైన ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Sat, 10 Feb 202404:33 AM IST
ఖమ్మం జిల్లా నుంచి తొలి వ్యక్తి
మల్లు భట్టి విక్రమార్క శనివారం ఆర్ధిక శాఖా మంత్రిగా రాష్ట్ర తొలి పద్దు(Telangana Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు. భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఖమ్మం జిల్లాకు ఇది ఒక అరుదైన గౌరవంగానే విశ్లేషకులు చర్చిస్తున్నారు.
Sat, 10 Feb 202404:31 AM IST
భట్టి కామెంట్స్….
బడ్జెట్ లో అన్ని అంశాలు ఉంటాయన్నారు ఆర్థిక మంత్రి భట్టి. పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న ఆయన… ఆస్తులు.. అప్పులతో పాటు కేంద్రం నుండి వచ్చే ఆదాయంపైనా బడ్జెట్ ప్రసంగంలో ఉంటాయని చెప్పుకొచ్చారు.
Sat, 10 Feb 202404:29 AM IST
ఆరు గ్యారెంటీలు - సంక్షేమం
ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఎన్నికల హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించింది కాంగ్రెస్. వీటిలోని పలు అంశాలకు సంబంధించి కేటాయింపులు ఉండే ఛాన్స్ ఉంది. విద్యుత్, వ్యవసాయం, పంచాయితీరాజ్ తో పాటు పలు శాఖలకు అధికంగా నిధులు వచ్చే అవకాశం ఉంది.
Sat, 10 Feb 202404:28 AM IST
ఆ తర్వాతే పూర్తిస్థాయి బడ్జెట్…
పార్లమెంట్ ఎన్నికల తర్వాత…. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇదే విషయాన్ని బీఏసీలో సమావేశంలో కూడా చర్చించారు.
Sat, 10 Feb 202404:28 AM IST
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో కొత్త ప్రతిపాదనలు లేకుండా కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. సాధారణంగా జరిగే ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ పంపిణీ వంటివి మాత్రమే ఉంటాయని సమాచారం.
Sat, 10 Feb 202404:28 AM IST
ప్రవేశపెట్టనున్న భట్టి…..
శనివారం మధ్యాహ్నాం 12 గంటలకు ఓటాన్ అకౌంట్ (ఓట్ ఆన్ అకౌంట్) బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క(Finance Minister Mallu Bhatti Vikramarka) అసెంబ్లీ ముందుకు పద్దను తీసుకురానుండగా… మరోవైపు శాసన మండలిలో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు.
Sat, 10 Feb 202404:30 AM IST
ఈసారి ఎంత ఉండొచ్చంటే…
ఈ సారి సుమారు రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల వేళ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులే బడ్జెట్‌లో ఉండనున్నాయి. ఆ తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది సర్కార్.
Sat, 10 Feb 202404:24 AM IST
బడ్జెట్ కు ఆమోదం
ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ -2024ను ప్రవేశపెట్టనుంది. ఉదయం భేటీ అయిన మంత్రివర్గం…. పద్దుకు ఆమోదముద్ర వేసింది.