తెలుగు న్యూస్ / తెలంగాణ /
Telangana Tourism : వన్ డే ట్రిప్ లో 9 స్పాట్స్ చూడొచ్చు..! మీకోసమే ‘హైదరాబాద్ సిటీ టూర్ ప్యాకేజీ’ - ధర చాలా తక్కువ
Telangana Tourism Hyderabad City Tour: హైదరాబాద్ నగరాన్ని చూసేందుకు మంచి ప్యాకేజీ వచ్చేసింది. నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూసేందుకు తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. కేవలం ఒక్కరోజులోనే పూర్తి అవుతుంది. టూరిజం వెబ్ సైట్లోకి వెళ్లి టికెట్లను బుకించ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే…..
హైదరాబాద్ టూర్ ప్యాకేజీ
హైదరాబాద్ సిటీని ఒకే రోజులో చుట్టేయాలనుకుంటున్నారా..? అది కూడా అతి తక్కువ ధరలోనే చూసే ప్యాకేజీల కోసం చూస్తున్నారా..? అయితే మీకోసమే తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. కేవలం వన్ డే లోనే ఈ ట్రిప్ పూర్తి అవుతుంది. ధర చాలా తక్కువగా ఉంది.
తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే ‘HYDERABAD CITY TOUR’ పేరుతో ఈ ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది. ప్రతి రోజు ఆపరేట్ చేస్తారు. మీకు అనుగుణంగా తేదీలను ఎంచుకోని బుకింగ్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచే జర్నీ ఉంటుంది.
చూసే ప్రాంతాలు - టూర్ ప్యాకేజీ వివరాలు
- హైదరాబాద్ సిటీ ట్రిప్ ప్యాకేజీ కేవలం వన్ డే లోనే ముగుస్తుంది. సిటీ నుంచే జర్నీ ఉంటుంది.
- బిర్లా మందిర్, చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్‌లో షాపింగ్, సాలార్ జంగ్ మ్యూజియం, నిజాం కుపురానీ పెవిలియోన్, గుపురానీ పెవిలియన్, షాహీ టూంబ్స్, లుంబినీ పార్క్ ను చూస్తారు.
- హైదరాబాద్ లోని హియామయత్‌నగర్ వద్ద టెర్మినేటింగ్ పాయింట్ అనుమతిస్తారు.అన్ని మ్యూజియంలు శుక్రవారం మూసివేస్తారు. ఇందుకు బదులుగా శుక్రవారం నెహ్రూ జూ పార్క్ కవర్ చేస్తారు.
- ప్రతి శుక్రవారం 7 స్థలాలు, మిగిలిన అన్ని రోజులు 9 స్థలాలు టూర్ ప్యాకేజీ లో కవర్ అవుతాయి. మీరు వెళ్లే రోజును బట్టి ఈ విషయంలో ఓ అంచనాకు రావొచ్చు.
- హైదరాబాద్ సిటీ టూర్ ప్యాకేజీ ధరలు : నాన్ ఏసీలో పెద్ద వారికి రూ. రూ.380గా నిర్ణయించారు. చిన్నారులకు రూ.300గా ఉంది. ఏసీ జర్నీలో అయితే పెద్దలకు రూ.500, చిన్నారులకు రూ.400గా ఉంది.
- ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలంటే… ఉదయం 7.30 AM - రిజర్వేషన్ కార్యాలయం, TSTDC, యాత్రి నివాస్, S.P.రోడ్, సికింద్రాబాద్, ఫోన్: 9848126947ను సంప్రదించవచ్చు.
- ఉదయం 07:45 గంటలకు- రిజర్వేషన్ కార్యాలయం, TSTDC, టూరిజం ప్లాజా, బేగంపేట్, హైదరాబాద్- ఫోన్: 8367285285కు కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు.
- ఉదయం 8. 15 గంటలకు అయితే … CRO బషీర్‌బాగ్, గ్రౌండ్ ఫ్లోర్ శకర్ భవన్, ఎదురుగా. సీసీఎస్ పోలీస్ కంట్రోల్ రూమ్, టాటా మోటార్స్ పక్కన, బషీర్‌బాగ్, హైదరాబాద్- ఫోన్ నెంబర్ 9848540371ను సంప్రదించవచ్చు.
- మీరే వెళ్లే ప్రదేశాల వద్ద ఎంట్రీ టికెట్ తో పాటు భోజన ఖర్చులను సొంతంగానే భరించాల్సి ఉంటుంది.
- ప్యాకేజీ బుకింగ్ డైరెక్ట్ లింక్: https://tourism.telangana.gov.in/package/hyderabadcitytour
సంబంధిత కథనం