Araku Tour Package 2025 : న్యూ ఇయర్ వేళ 'అరకు' ట్రిప్ - తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ వచ్చేసింది..! ధర తక్కువే-telangana tourism to operate araku tour package from hyderabad city in january 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Araku Tour Package 2025 : న్యూ ఇయర్ వేళ 'అరకు' ట్రిప్ - తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ వచ్చేసింది..! ధర తక్కువే

Araku Tour Package 2025 : న్యూ ఇయర్ వేళ 'అరకు' ట్రిప్ - తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ వచ్చేసింది..! ధర తక్కువే

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 26, 2024 08:29 PM IST

Telangana Tourism Araku Package : వచ్చే న్యూ ఇయర్ లో అరకు ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ ఆపరేట్ చేసే ఈ ట్రిప్.. 4 రోజులు ఉంటుంది. టూర్ షెడ్యూల్ తో పాటు ధరల వివరాలను ఇక్కడ చూడండి….

అరకు
అరకు (image source AP Tourism)

మరికొద్దిరోజుల్లోనే న్యూ ఇయర్ రాబోతుంది..! అయితే కొత్త సంవత్సరం వేళ అరకు అందాలను అస్వాదించాలనుకునే వారికి తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే జనవరిలో హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

yearly horoscope entry point

ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. కేవలం రూ.6999తో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీ జనవరి 15, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే… మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్డేట్స్ తెలుసుకోవచ్చు.

టూర్ షెడ్యూల్ వివరాలు…

  • హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ట్రిప్ మొత్తం నాలుగు రోజులపాటు ఈ ట్రిప్ ఉంటుంది.
  • ఈ ట్రిప్ లో భాగంగా… అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరి చూడొచ్చు.
  • నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది.
  • రెండో రోజు ఉదయం 6 గంటలకు వైజాగ్ కు చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. సింహాచలం, కైలాసగిరి, Rushikondaను చూస్తారు. అంతేకాకుండా…. సబ్ మైరైన్ మ్యూజియంను సందర్శిస్తారు.సాయంత్రం వైజాగ్ బీచ్ ను చూస్తారు. రాత్రి వైజాగ్ లోనే బస చేస్తారు.
  • మూడో రోజు ఉదయం 6 గంటలకు అరకు చేరుకుంటారు. ఈ జర్నీ చాలా బాగుంటుంది. అరకులో ఉంటే ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లానిటేషన్, బొర్రా కేవ్స్, థిమ్సా డ్యాన్స్ ను చూస్తారు. రాత్రి అరకులోనే ఉంటారు.
  • 4వ రోజు అన్నవరం చేరుకుంటారు. దర్శనం తర్వాత హైదరాబాద్ రిటర్న్ జర్నీ ఉంటుంది. ఐదో రోజు ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది.

ధరల వివరాలు:

హైదరాబాద్ - అరకు ట్రిప్ ధరలు చూస్తే… పెద్దవారికి రూ. రూ. 6,999గా ఉంది. పిల్లలకు 5.599గా నిర్ణయించారు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.

కేవలం అరకు ప్యాకేజీ మాత్రమే కాకుండా… న్యూ ఇయర్ వేళ షిర్డీ, నాగార్జున సాగర్, అరుణాచలం, శ్రీశైలంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది.

 

Whats_app_banner

సంబంధిత కథనం