Telangana Tourism : కట్టిపడేసే 'సోమశిల' అందాలే కాదు... 'శ్రీశైలం' కూడా చూడొచ్చు, ఇదిగో టూర్ ప్యాకేజీ
Telangana Tourism Tour Package: కృష్ణమ్మ పరవళ్లతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఇదే పరివాహాక ప్రాంతంలో ఉన్న సోమశిలతో పాటు శ్రీశైలం ప్రాజెక్టులు నిండుకుండగా మారాయి. శ్రీశైలంలో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాంతాలను చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
Srisailam - Somasila Tour Package : ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. పరివాహక ప్రాంతాలు కూడా సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. ఇక తెలంగాణ ప్రాంతంలో ఉన్న సోమశిలతో పాటు శ్రీశైలం ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివెళ్తున్నారు.
పచ్చని ప్రకృతి అందాల మధ్య జర్నీ చేసేందుకు టూరిస్టులు తెగ ఆసక్తి చూపుతుంటారు. అయితే తక్కువ బడ్జెట్ లోనే తెలంగాణ టూరిజం రెండు రోజుల ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. Srisailam - Somasila Road cum River Cruise Tour పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ప్రతి వీకెండ్ శనివారం తేదీల్లో జర్నీ ఉంటుంది.
- హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
- ప్రతి శనివారం తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
- రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
- నాన్ ఏసీ కోచ్ బస్సులో ప్రయాణం ఉంటుంది.
- ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది.
- శ్రీశైలం చేరుకొని… రాత్రి అక్కడే బస చేస్తారు.
- రెండో రోజు శ్రీశైలంలోని డ్యామ్ ను చూస్తారు. అక్కడ్నుంచి క్రూజ్ బోట్ లో సోమశిల చేరుకుంటారు. బోట్ లో మీల్స్ ఇస్తారు. (నదిలో నీళ్లు నిలకడగా ఉంటే క్రూజ్ బోట్ జర్నీ ఉంటుంది. అంతేకాకుండా బోటు పూర్తిగా నిండేలా బుకింగ్స్ ఉండాలి. ఈ జర్నీపై టూరిజం వారు సమాచారం ఇస్తారు)
- సాయంత్రం 5 గంటలకు సోమశిల నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతారు.
- రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరల వివరాలు :
హైదరాబాద్ - శ్రీశైలం - సోమశిల టూరిజం ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 4999గా నిర్ణయించారు. పిల్లలకు రూ. 3600గా ఉంది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డైరెక్ట్ గా టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.