Telangana Tourism : 'రామప్ప' టెంపుల్ ను చూశారా..? తక్కువ ధరలోనే కొత్త టూర్ ప్యాకేజీ, బోటింగ్ కూడా ఉంటుంది..!
Ramappa Temple Tour Package : ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని చూడాలనుకుంటున్నారా..? అయితే తెలంగాణ టూరిజం కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. వీకెండ్స్ లో హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. దారి మధ్యలో ఉండే వరంగల్ లో పలు ఆలయాలను కూడా చూడొచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది.
యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రాంతంగా కూడా రామప్ప గుర్తింపు పొందిన సంగతి కూడా తెలిసిందే. ఈ ఆలయాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈ ఆలయాన్ని చూసేందుకు తెలంగాణ టూరిజం కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.
"UNESCO World Heritage Site - Ramappa Temple' పేరుతో హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఏసీ మినీ బస్సులో జర్నీ ఉంటుంది. ప్రతి శనివారం, ఆదివారం తేదీల్లో జర్నీ ఉంటుంది.
టూర్ షెడ్యూల్ :
- 06:30 AM : హైదరాబాద్ లోని యాత్రినివాస్ నుంచి బస్సు బయల్దేరుతుంది.
- 06:45 AM : పర్యాటక భవన్ కు చేరుకుంటుంది.
- 10:00 AM To 12:45 PM : హన్మకొండకు చేరుకుంటారు. స్థానికంగా ఉండే ఆలయాన్ని చూస్తారు.
- 01:00 PM : హరిత కాకతీయలో లంచ్ ఉంటుంది.
- 01:50 PM : రామప్పకు బయల్దేరుతారు.
- 03:15 PM To 04:15 PM : రామప్ప ఆలయాన్ని దర్శించుకుంటారు.
- 04:20 PM To 04:40 PM : రామప్ప సరసులో బోటింగ్ ఉంటుంది.(15 నిమిషాలు మాత్రమే)
- 04:45 PM To 05:30 PM : రామప్ప వద్ద ఉన్న హరిత కాకతీయలో టీ బ్రేక్ ఉంటుంది.
- 05:30 PM : హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు.
- 09:30 PM : హైదరాబాద్ కు చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.
చూసే ఆలయాలు:
- భద్రకాళి ఆలయం, వరంగల్
- పద్మాక్షి అమ్మవారి ఆలయం, వరంగల్
- వెయ్యి స్తంభాల గుడి, వరంగల్.
- రామప్ప గుడి
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 2800గా ఉంది. పిల్లలకు 2,240గా నిర్ణయించారు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.
NOTE: హైదరాబాద్ - రామప్ప టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://tourism.telangana.gov.in/toursList?type=Road&groupCode=2&serviceCode=352&journeyDate=2024-11-17&adults=2&childs=0
సంబంధిత కథనం