Hyderabad Nizam Palaces Tour : చౌమహల్లా, ఫలక్‌నుమా ప్యాలెస్ చూశారా..? తక్కువ ధరలోనే వన్ డే టూర్ ప్యాకేజీ, వివరాలివే
Hyderabad Nizam Palaces Tour : హైదరాబాద్ నగరంలో ఉన్న నిజాం ప్యాలెస్ లను చూసేందుకు తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కేవలం ఒక్క రోజులోనే ఈ టూర్ ముగుస్తుంది.
Hyderabad Nizam Palaces Tour : తెలంగాణ టూరిజం నుంచి మరో ప్యాకేజీ వచ్చేసింది..! హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ ప్యాలెస్ లను చూసేందుకు ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ట్రిప్ ను బుకింగ్ చేసుకోవచ్చు.

నిజాం ప్యాలెస్ టూర్ ప్యాకేజీ వివరాలు :
- తెలంగాణ టూరిజం Nizam Palaces Tour ప్యాకేజీని ప్రకటించింది.
- ఈ ప్యాకేజీ ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది.
- 12.00 pm.. బేగంపేట్ లోని టూరిజం ప్లాజా నుంచి బస్సు బయల్దేరుతుంది.
- 12.15 pm .. తాజ్ కృష్ణకు చేరుకుంటుంది.
- 12.45 pm - ట్యాంక్ బండ్ కు చేరుకుంటారు.
- ముందుగా చౌహముల్లా ప్యాలెస్ అందాలను వీక్షిస్తారు. ఆ తర్వాత ఫలక్ నుమా ప్యాలెస్ ను సందర్శిస్తారు. 7వ నిజాం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను 'రాయల్ గెస్ట్ హౌస్'గా వినియోగించుకున్నారు
- ఈ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 2400గా నిర్ణయించారు.
- చిన్నారులకు రూ. 1920గా టికెట్ ధర ఉంది.
- ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది.
తెలంగాణ టూరిజం అరకు టూర్ ప్యాకేజీ
మరోవైపు అతి తక్కువ ధరలోనే అరకును చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం(Telangana Tourism). రోడ్డు మార్గం ద్వారా…ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తుంది. కేవలం రూ.6999తో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు.
అరకు టూర్ షెడ్యూల్:
- అరకుకు టూరిజం ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం(Telangana Tourism) . Araku Tour - Telangana Tourism పేరుతో ఆపరేట్ చేస్తుంది.
- ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. 4 రోజులు ఉంటుంది.
- చూసే ప్రాంతాలు : అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరి,
- బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది.
- రెండో రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. సింహాచలం, కైలాసగిరి, Rushikondaను చూస్తారు. అంతేకాకుండా…. సబ్ మైరైన్ మ్యూజియంను సందర్శిస్తారు.సాయంత్రం వైజాగ్ బీచ్ ను చూస్తారు. రాత్రి వైజాగ్ లోనే బస చేస్తారు.
- ఉదయం 6 గంటలకు అరకు చేరుకుంటారు. ఈ జర్నీ చాలా బాగుంటుంది. అరకులో ఉంటే ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లానిటేషన్, Borracaves, Dhisma Danceను చూస్తారు. రాత్రి అరకులోనే ఉంటారు.
- నాల్గో రోజు అన్నవరం చేరుకుంటారు. దర్శనం తర్వాత హైదరాబాద్ రిటర్న్ జర్నీ ఉంటుంది.
- ఐదో రోజు ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
- నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది.
- టికెట్ ధరలు చూస్తే… పెద్దవారికి రూ. రూ. 6,999గా ఉంది. పిల్లలకు 5.599గా నిర్ణయించారు.
ఇక దక్షిణ తెలంగాణలోని అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారి ఆలయంతో పాటు బీచ్ పల్లిలోని ఆంజనేయస్వామి ఆలయానికి దర్శించుకునేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. శని, ఆదివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ట్రిప్ ను బుకింగ్ చేసుకోవచ్చు.